village : ఆ గ్రామం వీడియోకు 5 కోట్ల వ్యూస్.. స్పెషాలిటీ తెలిస్తే కూడా వెళ్తారు

village

village

village : శాస్త్ర సాంకేతికత పెరుగుతున్న ఈ రోజుల్లో తోటి మనిషితో పోటీ పెరిగిపోయింది. అయినా మోడ్రన్ జరేషన్, టెక్నాలజీకి దూరంగా కొన్ని గ్రామలు ఉన్నాయి అంటే ఆశ్చర్యపడాల్సిందే కదా.. అక్కడ ఆచారాలు, విశ్వాసాలను నమ్ముతూ జీవించే వారు లేకపోలేరు. వాటిని మూఢ నమ్మకంగా చూస్తాం కాని ఆ ప్రాంతాల ప్రజలకు అవి చాలా ప్రత్యేకమైనవని చాలా మంది గుర్తించారు. అలాంటి వెరైటీ గ్రామం గురించి తెలుసుకుందాం.

ఈ గ్రామం మన దేశంలోని రాజస్థాన్‌లో ఉంది. ప్రత్యేకత ఏంటంటే గ్రామంలోని ప్రతీ ఒక్కరి ఇల్లు గోడలు మట్టితో, పైకప్పు పెంకులతో ఉంటాయి. ఈ గ్రామంలో పేదవారు, కోటీశ్వరులు అనే తేడా లేదు. ఎవ్వరైనా ఇళ్లు ఇలాగే కట్టుకోవాలి. ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు అక్కడి ప్రజలు.

ఇటీవల ఈ గ్రామం గురించి @ask_bhai9 ఇన్‌ స్టాలో ఒక వీడియో పోస్టయ్యింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని బేవార్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం పేరు దేవమాలి. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న అందరూ మట్టి ఇళ్లలోనే నివసిస్తారు.

పేదవారి నుంచి ధనవంతులు, కోటీశ్వరులు కూడా మట్టితో కట్టిన దాంట్లోనే జీవించాలి. ఎక్కడా అపార్టుమెంట్లు, భారీ భవనాలు కనిపించవు.. జనం నివసించరు. గ్రామానికి సంబంధించిన కొన్ని వాస్తవాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఈ గ్రామం గురించి విశిష్టమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్వరూ మద్యం తాగరు. దీనికి తోడు అందరూ శాఖా హారులే. మటన్, చికెన్, ఫిష్ వంటి మాంసాహారానికి కూడా దూరంగా ఉంటారు. ఇంకా గ్రామంలోని ఇళ్లకు ఎవరూ తాళం వేయరని ఉంది.

గుర్జర్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు. దేవమాలిలోనికి చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. అయినా వీరిలో మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి ప్రజలు దేవనారాయణుడిని పూజిస్తారు.

దేవనారాయణ వచ్చినప్పుడు సేవ చేయడం సంతోషంగా ఉందని ప్రజలు నమ్ముతారు. ఏటా ఉత్సవాలు చేస్తారు. గ్రామంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొనాలని భగవంతుడు దీవిస్తాడని నమ్ముతారు.

గ్రామానికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. వీడియోకు 5 కోట్లకు పైగా వ్యూవ్స్ కూడా వచ్చాయి. చాలా మంది తమ అభిప్రాయాన్ని కూడా చెప్పారు. గ్రామం అందంగా ఉందని కామెంట్లు వచ్చాయి. ఈ గ్రామంలో ఇలానే ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు.

TAGS