Brother Anil : ఒకప్పుడు రాజకీయాలు ఎంతో హుందాతనంగా ఉండేవి. సద్విమర్శలే తప్పు కువిమర్శలు ఉండేవి కావు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లేవారు కాదు. వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు. అప్పట్లో ఎన్నికలంటే ఇంత హడావిడి కూడా ఉండేది కాదు. నిరక్షరాస్యులు కూడా నిజాయితీగా ఓటేసేవారు. నాయకులు కూడా ఎన్నికల్లో తమ పేరు, ప్రతిష్టలు, నీతి, నిజాయితీల పైనే గెలిచేవారు. డబ్బు, మద్యం ప్రలోభాలు, బూతుల కొట్లాటలు అసలే ఉండేవి కావు. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూచేవారు కాదు. అలాంటి విమర్శలు ఉండేవి కావు. అప్పటి నేతలను ఇప్పటికీ గొప్పగా కీర్తిస్తున్నామంటే వారి ప్రవర్తన, హుందాతనమే కారణం.
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సొంత అన్న, సొంత చెల్లి ఉన్న విమర్శించక తప్పని దుస్థితి. కుటుంబంలో జరిగిన విషయాలను బయట పెట్టుకోవాల్సిన ఖర్మ. పరుష పదజాలాలు లేనిది నేటి రాజకీయాలు మనుగడ సాగించలేవు. ఎంత ఎక్కువ తిడితే అంత పవర్ ఫుల్ లీడర్. హుందాగా, మర్యాదగా ప్రవర్తించే లీడర్ ను ఏ మీడియా పట్టించుకోదు.
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలు బజారున వేస్తున్నారు. ఆయనకు ఎంత మంది భార్యలు, ఆమె పాత మొగుడు, ఆయన పాత భార్య..ఇలా సాగుతోంది వ్యవహారం. ఒక నాయకుడికి ముగ్గురు పెళ్లాలు, ఓ నాయకుడి బాబాయ్ హత్య, మరో నాయకుడు వెన్నుపోటు దారుడు..ఇలా ఎవరి నోటికొచ్చింది వారు ఇష్టారీతన పలుకుతునే ఉన్నారు.
ఇక వైఎస్ షర్మిల వ్యక్తిగత జీవితాన్ని ఇలాగే లాగుతూ తమ సంస్కారాన్ని కొందరు దిగజార్చుకుంటున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమెకు కొండ రాఘవరెడ్డి అండగా ఉన్నారు. అప్పట్లో షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన కుదర్లేదు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె అన్నపైనే మాటల యుద్ధం ప్రారంభించింది. దీంతో వైసీపీ నాయకులు ఊరుకుంటారా?.. ఆమె వ్యక్తిగత జీవితంపైనే దాడికి దిగారు. ఆమె భర్త అనిల్ కుమార్ ను ఇందులోకి లాగారు.
వాస్తవానికి బ్రదర్ అనిల్ కుమార్ కు గతంలోనే పెళ్లయింది. షర్మిలకు కూడా ఇదివరకే వివాహం జరిగింది. వారిద్దరికీ ఇది రెండో పెళ్లి. ఈక్రమంలో ఓ యూట్యూబ్ చానెల్ కొండా రాఘవరెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. దీనిలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘వైఎస్ షర్మిలకు విపరీతమైన మనస్తత్వం ఉంటుంది. పెళ్లి రాజకీయాల వరకు అన్ని విషయాల్లో ఆమె వ్యవహార శైలి అలానే ఉంటుంది. అప్పట్లో ఆమె పార్టీ స్థాపించినప్పుడు అందరినీ ఏకవచనంతోనే సంబోధించేవారు. పార్టీని ఎలా డెవలప్ చేయాలో తెలిసేది కాదు..’’ అని చెప్పారు.
అలాగే అనిల్ కుమార్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. ఈ విషయం షర్మిలకు తెలుసు. ఆమె ఇప్పటికీ అంబర్ పేటలో ఉంటోంది. అప్పుడప్పుడు అనిల్ ఆమె దగ్గరకు వెళ్లి వస్తుంటారు. అనిల్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకున్నా షర్మిల పెళ్లి చేసుకుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న స్క్రీన్ లో అనిల్ కుమార్ మొదటి భార్య, ఆమె కూతురు ఫొటో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై వైసీపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. అయితే ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో వాళ్లకే తెలియాలి.