Hats Off to the Mother : ఇంత పెద్ద విశ్వంలో నువ్వు, నీ లైఫ్ చాలా చిన్నది. మనస్సు నిండా ఈగోలు, మనస్పర్థలు, కోప, తాపాలు పెట్టుకొని జీవించడం నిజంగా బాధకరమనే చెప్పాలి. కానీ ఇవేవి లేకుండా జంతు జాతి ఉండవచ్చేమోగానీ మానవజాతి ఉండడం మాత్రం అస్సలు కుదరదు.
ఈ అనంత విశ్వంలో పాలపుంతే చిన్న గోళం.. ఆ పాలపుంతలో సూర్యుడు, గ్రహాలు, భూమి అందులో మానవులు ఎంత. జీవితం చాలా చిన్నది.. రావడం ఇక్కడ కొన్ని రోజులు ఉండడం మళ్లీ ప్రయాణం కావడం. భగవత్ గీత ప్రకారం పుట్టిన వాడికి మరణం తప్పదు.. మరణించిన వాడికి జననం తప్పదని అనుకున్నా.. మళ్లీ మనం జన్మించినా కేవలం జన్మించడమే కానీ గత జన్మ గురించి మాత్రం తెలియదు కదా?
ప్రపంచంలో చాలా దేశాలు పుట్టుక, చావును చాలా ఎమోషనల్ గా తీసుకుంటాయి. పుట్టుక నుంచి చావు వరకు సాగుతున్న అతి చిన్న జర్నీ గురించి భారతీయులు మాత్రం చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఇక్కడ ఒక తల్లి పుట్టుక, ఈగో, భేషజాల గురించి చెప్పడం నిజంగా హ్యాట్సాఫ్ అనుకోవాలి.