HanuMan : ఈ సంక్రాంతి విడుదలైన ‘హనుమాన్’ సినిమాతో ప్రేక్షకులకు, సినీ మేధావులకు ఒక విషయం స్పష్టం గా అర్థం అయ్యింది. ఇక నుండి టాలీవుడ్ లో స్టార్ హీరోల హవా పోయింది. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలదే రాజ్యం అని. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఈ సినిమా భారీ మార్జిన్ తో వసూళ్ల పరంగా అధిగమించడమే అందుకు ఉదాహరణ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
‘హనుమాన్’ చిత్రం విడుదలకు ముందు ఎన్నో అవమానాలను ఎదురుకుంది. తమ సినిమాలకు చిన్న సినిమా పోటీ రావడం ఏమిటి?, అంత ధైర్యమా అంటూ థియేటర్స్ దక్కనివ్వకుండా తొక్కి పారేసారు. ఉన్న థియేటర్స్ లోనే విడుదలై కనీవినీ ఎరుగని రేంజ్ వసూళ్లను సాధించి కంటెంట్ ఉన్న సినిమాని ఎవ్వరూ ఆపలేరు అని నిరూపించింది. ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ చిత్రానికి ఉన్న టికెట్ రేట్స్, భారీ రిలీజ్ ఉండి ఉంటే #RRR ని కూడా దాటేసి ఉండేది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇకపోతే ఈ సినిమాని ప్రశాంత్ వర్మ ముందుగా పెద్ద స్టార్స్ తోనే చేద్దాం అని అనుకున్నాడు. ఎందుకంటే కథలో అంత స్కోప్ ఉంది కాబట్టి. కానీ ప్రశాంత్ వర్మ ఒక చిన్న డైరెక్టర్, ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలు లేవు అనే చిన్న చూపుతో చాలా మంది అతనితో సినిమా చెయ్యడానికి నిరాకరించారు. వారిలో ఒక ప్రముఖ హీరోయిన్ కూడా ఉందని రీసెంట్ గానే తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా శ్రీలీల ని అడిగారట. కుర్ర హీరో , కుర్ర హీరోయిన్ కాబట్టి సరిగ్గా జోడీ సరిపోతుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆమెని కలిసి స్టోరీ ని వివరించి డేట్స్ ని అడిగాడట. కాస్త పేరున్న హీరో డైరెక్టర్ తగిలితే పనికిమాలిన సినిమాలకు డేట్స్ ఇచ్చే శ్రీలీల, ఈ సినిమాకి మాత్రం డేట్స్ లేవని తెగేసి చెప్పి వెనక్కి పంపేసిందట. అమ్మడు పొగరు ని చూసి ప్రశాంత్ వర్మ చాలా ఫీల్ కూడా అయ్యాడట.
అందుకే అమ్రితా అయ్యర్ అనే కొత్త హీరోయిన్ ని తీసుకున్నారు. అంతకు ముందు ఈమె రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అర్జునా ఫాల్గుణ వంటి సినిమాలు చేసింది. ఈ సినేమకి తొలుత ఆమెకి ఇచ్చింది కేవలం 30 లక్షల రూపాయిలు మాత్రమే. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యి భారీ లాభాలు వచ్చిన తర్వాత ఆమెకి మరో కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారట.రాబొయ్యే రోజుల్లో ఈమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.