Rana Naidu:దగ్గుబాటి రానా, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తొలి వెబ్ సిరీస్ `రానా నాయుడు`. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. అయితే మితి మీరిన శృంగారం, బూతు డైలాగ్‌లు, హింసాత్మక సన్నివేశాలు అధికంగా ఉండటం, అలాంటి సిరీస్‌లో ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ నటించడంతో ఈ సిరీస్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సిరీస్‌లో వెంకటేష్ నటించి పెద్ద తప్పు చేశారని పలువురు విమర్శకులు, ఆయనని ఇష్టపడే ప్రేక్షకులు పెదవి విరిచారు.
అయినా సరే ఈ సిరీస్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ ఏడాది మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ తాజాగా అరుదైన ఘనతని సాధించింది. 2023 జనవరి నుంచి జూన్ వరకు ఎక్కువ వ్యూస్‌ని రాబట్టిన పలు సిరీస్‌ల వివరాలని తాజాగా నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ జాబితాలో `రానా నాయుడు` చోటు దక్కించుకుంది. అంతే కాకుండా ఇండియా నుంచి ఆ ఘనతను సాధించిన ఒకే ఒక్క సిరీస్ ఇదే కావడం విశేషం.
2021 నుంచి నెట్ ఫ్లిక్స్ ప్రతివారం ఎక్కువ వ్యూస్‌ని సాధించిన టాప్ 10 మూవీస్, సిరీస్‌ల జాబితాను ప్రకటిస్తోంది. ఈ సారి ఆరు నెలల జాబితాను విడుదల చేసింది. వ్యూస్ ఆధారంగా సుమారు 18 వేల టైటిల్స్ డేటాను పరిశీలించింది. గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్ 400ను విడుదల చేసింది. ఇందులో `రానా నాయుడు` టాప్ 336లో నిలిచింది. భారత్ నుంచి ఈ సిరీస్ మాత్రమే టాప్ 400లో స్థానం దక్కించుకుంది. దీన్ని వీక్షకులు 46 మిలియన్‌ల గంటలు వీక్షించినట్టుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. అమెరికన్ సిరీస్ `రే డొనోవన్`కు రీమేక్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు.