JAISW News Telugu

Jabardasth Rohini : రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన జబర్దస్త్ రోహిణి.. అసలేం జరిగిందంటే..

Jabardasth Rohini : బెంగళూరు లో ఆ మధ్య జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో తాను కాదని బుకాయించే ప్రయత్నం చేయగా.. బెంగళూరు పోలీసులు డైరెక్టుగా ఆమె పేరు రిలీజ్ చేశారు. దీంతో ఆమె బెంగళూరు పోలీసుల ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. ఈ కేసులో దాదాపు 40 మంది పట్టుబడగా.. తెలుగు నటీనటులు ఇద్దరు, ముగ్గురు అని పేర్లున్నా.. హేమ పేరును మాత్రం బయటకు రిలీజ్ చేశారు.

హేమకు టెస్టు చేయగా పాజిటివ్ అని తేలడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బెయిల్ పై ఆమె విడుదలైంది. నటి హేమకు ముందుగా సపోర్టుగా నిలిచిన మా అధ్యక్షుడు మంచు విష్ణు,  ఆ తర్వాత నిజం అని తేలడంతో ఆమెపై యాక్షన్ తీసుకున్నారు. ఆమెను మా అసోసియేషన్ నుంచి తీసేశారు.

ఇదే తరహాలో జబర్దస్త్ బబ్లీ నటి రోహిణి పట్టుబడింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతుండగా.. ఆమె ఏడుస్తూ మాట్లాడిన మాటల వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని తాను కేవలం బర్త్ డే పార్టీ ఉందంటే వచ్చానని చెబుతూ కన్నీటి పర్యంతమైంది. ఏన్ ఆర్ఐల బర్త్ డే పార్టీ అంటే ఎగేసుకుని రాకూడదని ఇప్పుడు తనకు తగిన శిక్ష పడిందంటూ బోరున ఏడ్చేసింది.

అయితే రోహిణి మాట్లాడిన తీరు, అక్కడున్న వాతావరణం చూస్తే కచ్చితంగా అది ఫ్రాంక్ వీడియో అని అర్థమవుతుంది. దీంతో నెటిజన్లు రోహిణిపై మండిపడుతున్నారు. నీకు బుద్ధిందా ఇలాంటి వాటిపై ఫ్రాంక్ లు చేస్తే నీ పని ఖతం. నిన్ను కూడా బొక్కలో వేసి మక్కలిరగ కొట్టించాలని అని ఘాటు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఫ్రాంక్ వీడియోనా… లేక నిజంగానే రోహిణి బుక్కయిందా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

Exit mobile version