Nag Ashwin : నిన్న (జూన్ 27) రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’ చూస్తే టాలీవుడ్ సినిమా చూస్తున్నామా? లేదంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నామా? అన్న ఫీలింగ్ ప్రతీ ప్రేక్షకుడికి కలిగింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా భారీ స్థాయికి వెళ్లిందని.. చివరి 20 నిమిషాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు.
అదే విజయ్ దేవరకొండ పాత్ర. ఇంత పెద్ద సినిమాకు విజయ్ దేవరకొండనే మైనస్ అని ట్రోల్ వస్తున్నాయి. అర్జునుడి పాత్రను కూడా తెలంగాణ యాసలో మాట్లాడిస్తే ఎలా.. కనీసం మీసాలైన తీసేస్తే బాగుండేది కదా అని ట్రోల్ చేస్తున్నారు.
దీనిపై చాలా మంది అసలు విజయ్ దేవరకొండను ఎందుకంత హేట్ చేస్తున్నారు. ఆయనకిచ్చిన క్యారెక్టర్ ఆయన చేశాడు. నిజానికి నాగ్ అశ్విన్‌కు విజయ్ సెంటిమెంట్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నుంచి మంచి ఫ్రెండ్. కేవలం నాగ్ అశ్విన్ అడిగాడు కాబట్టే ఆ రోల్ చేశాడట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత టాలీవుడ్ యూత్‌లో అంత క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండనే. బాలీవుడ్‌లో కూడా మనోడికి మంచి క్రేజ్ ఉంది. మనవాళ్లు ఓర్వలేకపోతున్నారు కానీ.. నార్త్‌లో విజయ్ తెరపై కనిపిస్తే చాలు ఈలలు, గోలలు.. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే.