South Actor : దక్షిణాది స్టార్ నటుడి కన్నుమూత.. విషాదంలో సౌత్ ఇండస్ట్రీ.. గుండెపోటుతో రాత్రి..

Daniel Balaji

South Actor Daniel Balaji and Vijay (File)

South Actor Daniel Balaji Passed away : గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాఖా కాఖా, వేటైయాడు విలయాడు, వెట్రి మారన్ తెరకెక్కించిన పొల్లాదవన్, వడచెన్నై వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తమిళ నటుడు డేనియల్ బాలాజీ శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

చిట్టి అనే తమిళ టెలివిజన్ సీరియల్ ద్వారా బుల్లితెర నటుడిగా తన ఉనికిని చాటుకున్న డేనియల్ బాలాజీ 2003, ఏప్రిల్ మత్తతిల్ అనే రొమాంటిక్ డ్రామా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. అయితే గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాఖా కాఖా సినిమాలో సూర్యతో పాటు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లలో ఒకరిగా నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు.

అద్భుతమైన పెర్ఫార్మర్ అయిన డేనియల్ బాలాజీ సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. కొన్నేళ్లుగా పలు చిత్రాల్లో ఆకట్టుకునే నటనను కనబరిచారు. వెట్రి మారన్ తెరకెక్కించిన పొల్లాదవన్, ఇటీవల వడచెన్నై చిత్రాల్లో అసాధారణ నటనతో సినీ ప్రియులు, విమర్శకుల హృదయాలను గెలుచుకున్నారు.

కమల్ హాసన్ ‘మరుధానాయగం’ సెట్స్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా పనిచేశాడు. తెలుగులో సాంబ, ఘర్షణ (2004), చిరుత (2007), సాహసం శ్వాసగా సాగిపో (2016), బిగిల్, టక్ జగదీష్ (2021).

పలువురి సంతాపం
బాలాజీ మరణవార్త తెలుసుకున్న తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన గౌతమ్ మీనన్, వెట్రి మారన్, అమీర్ సహా పలువురు అగ్ర దర్శకులు ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. నటుడి మరణం తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది, వారిలో చాలా మంది ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు.

దర్శకుడు మోహన్ రాజా ఎక్స్ (ట్విటర్) ద్వారా సంతాపాన్ని తెలిపారు. ‘విషాదకరమైన వార్త. నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేసేందుకు ఆయనే స్ఫూర్తి’. అని రాసుకున్నారు.  చాలా మంచి స్నేహితుడు. ఆయనతో కలిసి పనిచేయడం మిస్ అవుతున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి #RipDanielbalaji. రాశారు.

నటి సనమ్ శెట్టి కూడా ఎక్స్ లో సంతాపాన్ని తెలిపారు. ‘వేటైయాడు విల్లాయాడు’ సినిమాలోని ఓ క్లిప్ ను పోస్ట్ చేస్తూ ‘ఈ పాత్ర ఇప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. ఎంత పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, ఎంత తిరుగులేని నటుడు! తన ప్రతిభతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడు #DanielBalaji ఇక మనతో లేరనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓం శాంతి’ అన్నాడు.

TAGS