Rathika Eliminate : రతిక ఎలిమినేట్.. ఎరక్కపోయి ఇరుక్కున్న పల్లవి ప్రశాంత్!
Rathika Eliminate : బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం ఎపిసోడ్ అట్టహాసంగా ముగిసింది.. నిన్నటి ఆదివారంతో ఈ షో 12 వారాలు పూర్తి చేసుకుని ఈ రోజు నుండి 13వ వారం లోకి అడుగు పెట్టింది. ఇక వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున కోసమే ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు.. ఆ వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులను నాగ్ ఏకిపారేస్తుంటారు.
మొన్న శనివారం ఎపిసోడ్ లో నాగ్ క్లాస్ అయిపోవడంతో పాటు అశ్వినిని ఎలిమినేట్ కూడా చేసారు. ఇక నిన్న ఆదివారం ఎపిసోడ్ లో మరో ఎలిమేషన్ ఉండడంతో ఆడియెన్స్ అంత ఎదురు చూసారు.. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండడంతో ఆదివారం రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యింది..
ఇక అశ్విని వెళ్లే ముందు హిట్, ఫట్ ఎవరు అని నాగ్ తెలుసుకున్నారు.. ఇక హౌస్ లో శివాజీ, అమర్, గౌతమ్, శోభా శెట్టి, రతికా, ప్రియాంక, యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్ ఉండగా వీరిని రెండు బ్యాచేస్ గా విడదీసి ఫన్నీగా క్విజ్ పోటీ నిర్వహించారు. ఇలా నిన్నటి ఎపిసోడ్ మంచి సరదాగా గడిచేలా చేసాడు.
ఇక ఆ తర్వాత అర్జున్ అండ్ రతిక ఇద్దరు లాస్ట్ గా మిగలగా వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ను వినియోగించాలని అడిగారు. కానీ ప్రశాంత్ తెలివిగా 14వ వారం అర్హులకు వినియోగిస్తానని తెలివిగా చెప్పి తప్పించుకున్నాడు.. దీంతో రతికా ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్ గా హౌస్ లో 8 మంది ఉన్నారు..