Shivaji Wife Comments : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ గత సీజన్ కంటే బాగా ఆడియెన్స్ ను ఆకట్టు కుంటుంది.. పూర్తిగా ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో నడుస్తున్న ఈ సినిమా గత వారం మొత్తం అద్భుతంగా సాగింది..
మిగిలిన వారాల కంటే గత వారం ఆడియెన్స్ కు మాత్రమే కాదు హౌస్ మేట్స్ కు కూడా బాగా నచ్చింది. 10 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు.. మరి ఇప్పుడు వారిని కలిసే అవకాశం కల్పించారు. ఫ్యామిలీ వీక్ అంటూ గత వారం మొత్తం బాగా అలరించిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ తో మరింతగా ఆకట్టుకున్నాడు..
ఇక నిన్న ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎంతో ఎనర్జిటిక్ గా షోను ముందుకు నడిపించారు.. ఈయన ఆద్యంతం దీపావళి ఎపిసోడ్ ను స్పెషల్ గా నడిపించి ఆకట్టు కున్నాడు.. ఇక ఈ ఎపిసోడ్ లో కూడా కొంతమంది సభ్యుల కుటుంబం నుండి సభ్యులను పిలిపించారు..
అందులో భాగంగా శివాజీ భార్య శ్వేతతో పాటు చిన్న కుమారుడు కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద కాసేపు సందడి చేసారు.. ఈ వేదికపై శివాజీ భార్య మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.. ప్రస్తుతం మా కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం నాగార్జున, చిరంజీవి గారే అని ఈమె చెప్పుకొచ్చింది.
”మా కుటుంబానికి మీరు, చిరంజీవి గారు చేసిన సహాయం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాం అంటూ ఎమోషనల్ అయ్యింది.. దీంతో ఈ సమయంలో నాగ్ మాట్లాడుతూ మాదేమీ లేదు మీ ఆయన టాలెంట్ ఇలా నడిపించింది అంటూ నాగ్ చెప్పారు.. ఆ తర్వాత శివాజీ కల్పించుకుని నాగార్జున గురించి చాలా గొప్పగా చెప్పాడు.
మీరు ఎంత మందిని సపోర్ట్ చేసి ముందుకు నడిపించారో ఎవ్వరికి తెలియదు.. మీరు పెట్టిన భిక్షనే ఇది.. మీకు ఎంతో మంది రుణపడి ఉన్నారు.. అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు.. అలాగే శివాజీ చిన్న కుమారుడు కూడా కప్ గెలుచుకుని ఇంటికి రండి అంటూ చెప్పాడు..