JAISW News Telugu

Nayanthara : ఓటీటీ నుండి నయనతార ‘అన్నపూరని’ చిత్రం తొలగింపు!

Nayanthara's Annapoorani is out of OTT

Nayanthara’s Annapoorani is out from OTT

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అన్నపూరని’ అనే చిత్రం రీసెంట్ గానే ఓటీటీ లో విడుదలై మంచి రివ్యూస్ ని దక్కించుకుంటూ టాప్ లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాపై వివాదాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత హిందూ సంఘాలు హై కోర్టు లో ‘అన్నపూరని’ మూవీ టీం మరియు అందులో నటించిన నటీనటులందరి మీద కేసులు వేశారు.

హిందూ సంప్రదాయాలను, హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఇందులో చాలా సన్నివేశాలు ఉన్నాయని, తక్షణమే వాటిని పరిశీలించి ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో తొలగించమని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హై కోర్టు ని ఆశ్రయించారు. ఈ చిత్రం ఇప్పుడు కోర్టు కేసుల్లో చిక్కుకుంది, రోజు రోజుకి కేసు జటిలం అవుతుంది. ఇన్ని లీగల్ సమస్యలు ఉన్న కారణంగానే ఈ చిత్రం స్ట్రీమింగ్ ని ఆపేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

గత ఏడాది డిసెంబర్ 1 వ తారీఖున థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా  బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గ్రాసర్ గా నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కానీ ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇంత ఈ సినిమా కథ ఏమిటంటే   బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన ‘అన్నపూరని’ అనే అమ్మాయికి జీవితం లో పెద్ద చెఫ్ అవ్వాలని కోరిక ఉంటుంది. చిన్నతనం నుండి కూతురు ఏమి కోరుకున్నా కాదనకుండా చేసి పెట్టే తండ్రి చెఫ్ అవ్వడానికి మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే చెఫ్ అంటే కేవలం శాఖాహారం వంటలను మాత్రమే కాదు, మాంసాహార వంటలను కూడా వండాలి.

బ్రాహ్మణ కుటుంబం లో పుట్టినవాళ్ళు మాంసాహారం ముట్టుకోకూడదు కాబట్టి అన్నపూరని తండ్రి ఒప్పుకోదు. కానీ అన్నపూరని మాత్రం తన జీవిత లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఇంట్లో నుండి పారిపోయి ఒక పెద్ద హోటల్ లో చెఫ్ గా చేరుతుంది. ఉన్నత స్థాయికి వెళ్తున్న సమయం లో ఆ హోటల్ లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం కారణం గా , ఆమె రుచి చూస్తే తత్త్వం ని కోల్పోతుంది, ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే స్టోరీ. స్టోరీ విన్న తర్వాత ఈ సినిమా ఎందుకు ఇన్ని వివాదాల్లో చిక్కుకుందో మీకు అర్థం అయ్యే ఉంటుంది.

Exit mobile version