Ayushmann Khurrana : బాలీవుడ్ స్టార్లు సినిమా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు లేదా ఏదైనా తమకు ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారి స్వీట్ మెమొరీస్ ను పంచుకుంటుంటారు. అయితే బాలీవుడ్ స్టార్ మాత్రం తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ ఉన్నాయి. ఈ బాలీవుడ్ స్టార్ కూడా తన తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి గురించి విస్తూ పోయే వాస్తవాలు బయటపెట్టాడు. ఆయుష్మాన్ ఖురానా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా తన బాల్యం గురించి వెల్లడించారు. తన తండ్రి నియంత అని హానెస్ట్లీ సేయింగ్ పోడ్కాస్ట్లో చెప్పారు. తన పేరెంటింగ్ స్టైల్ తన తండ్రికి పూర్తిగా భిన్నమైనదని చెప్పుకొచ్చాడు., ‘నేను పూర్తిగా భిన్నమైన తండ్రిని. మా నాన్న నియంత. చెప్పులు, బెల్టులతో కొట్టడం మామూలు విషయం. నాకు బాల్యం తాలుకు గాయాలు ఇంకా గుర్తున్నాయని వెల్లడించారు. ఓ సారి తాను ఏ తప్పు చేయకున్నా తన తండ్రి కొట్టాడని చెప్పాడు.
ఇక ఆయుష్మాన్ ఖురానా పేరెంట్‌గా తన ప్రయాణం గురించి కూడా మాట్లాడాడు. తండ్రి కావాలని చాలా చిన్న వయసులోనే ప్రారంభమైందన్నారు. అతను 20 సంవత్సరాల చిన్న వయస్సులోనే ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత కూతురు పుట్టింది. తండ్రి అయిన తర్వాత తనలో మార్పు వచ్చిందని ఖురానా చెప్పారు. తనకు కుమార్తె ఉండటం గర్వంగా ఉందన్నారు.
తన భార్య తాహిరా కశ్యప్ గురించి మాట్లాడుతూ తన వ్యక్తిత్వంలో సానుకూల మార్పు తెచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. తాను ఫెమినిస్ట్ అని చెప్పుకోగలిగితే దానికి కారణం తాహిరా అని వెల్లడించారు. ఆయుష్మాన్ ఖురానా
సారా అలీ ఖాన్, రష్మిక మందన్నతో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు.