Whistle Podu Song : దళపతి విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది జీఓటీ)’ చిత్రంపై ప్రస్తుతం సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాక ముందు విజయ్ కి ఇది రెండో చివరి సినిమా కావడంతో బజ్ కు కారణమైంది.
తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ‘విజిల్ పోడు’ అనే ఫస్ట్ సింగిల్ ట్రాక్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
మెర్సల్‌లోని అలపోరన్ తమిళన్, మాస్టర్ నుంచి ‘కుట్టి స్టోరీ’, లియో నుంచి ‘నా రెడీ’ వరకు, ‘విజిల్ పోడు’ వంటి చెప్పుకోదగిన ఉదాహరణలతో హిట్ ఫస్ట్ సింగిల్స్ అందించిన ట్రాక్ రికార్డ్ విజయ్ కు ఉన్నప్పటికీ, ‘విజిల్ పోడు’ ప్రశంసలకు దూరంగా ఉండిపోయింది.
బీట్స్ బేసిక్ గా ఉంది. ట్యూన్ కూడా యావరేజ్. విజయ్ గానం యథావిధిగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద సినిమాకు ఇంత సాధారణ ట్యూన్ కు ఆమోదం లభించింది.
వినూత్నమైన సౌండ్స్, టెక్నాలజీతో అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్ లాంటి వారు ఆధిపత్యం చెలాయిస్తున్న నేటి సంగీత లోకంలో ప్రేక్షకులు కోరుకునే ఎనర్జీ, ఫ్రెష్ నెస్ యువన్ శంకర్ రాజా సంగీతంలో లోపించాయి. ఇప్పటికే అనిరుధ్ ను మిస్ అవుతున్న అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
విజయ్ ద్విపాత్రాభినయం చేయడం. టైమ్ ట్రావెల్ స్టోరీగా ‘ది జీవోటీ’ రూపొందుతోందని, హాలీవుడ్ చిత్రం ‘లూపర్’తో పోలికలు ఉన్నాయని, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని సమాచారం.
ఇప్పటికే రష్యాలో 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘ది జీవోటీ’పై ఆసక్తి పెరుగుతోంది.