Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు ఒక ఇంటిది అయ్యింది. కొంత కాలంగా వివాహానికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలకు తెర దించుతూ.. తన ప్రియుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగాన్నీతో తాళి కట్టించుకుంది. గోవాలో జరిగిన ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ కు చెందిన కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
అనంతరం అధికారికంగా రిలీజ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నాని నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం తమ ప్రేమను వెల్లడించిన తర్వాత వారు పలు చోట్ల కనిపిస్తూ విహార యాత్రల పేరిట తిరుగుతున్నట్లు చెప్పారు. కొంత కాలం డేటింగ్ చేసిన వీరు ఫిబ్రవరి 21వ తేదీ గోవాలో సిక్కు, ఆనంద్ కరాజ్ పద్ధతుల ద్వారా ఒక్కటయ్యారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
సంగీత్‌లో శిల్పాశెట్టి హంగామా
రకుల్ పెళ్లికి ముందు జరిగిన సంగీత్ లో బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్స్ శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా డాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ‘ముండియా తు బచ్ కే’ పాటపై ఇద్దరూ స్టెప్పులేసి కేక పుట్టించారు. సంగీత్ కు హీరో, హీరోయిన్లు రితేష్ దేశ్‌ముఖ్, భూమీ ఫడ్నేకర్ హోస్ట్ చేశారు. సంగీత్‌లో ఎక్కువగా షారుక్ పాటలకు స్టెప్పులేశారు.
రకుల్ ఎన్విరాన్ మెంట్ ఫ్రెండ్లీ పెండ్లి చేసుకున్నారు. టపాసులు, ప్లాస్టిక్ ను మండపం వద్దకు రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. విలాసవంతమైనది కాకుండా సాత్విక భోజనం వడ్డించారు. వివాహం అనంతరం వధూవరులు వారి ఫొటోలను ఇన్ స్టాలో రిలీజ్ చేశారు. ‘ఇక నీవు నా వాడివి. మనిద్దరం భగ్నానీలం అయ్యాం’ అంటూ తన ఇన్ స్టాలో పోస్టు పెట్టింది రకుల్. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.