JAISW News Telugu

Eega 2 : ‘ఈగ2’ ఎప్పుడంటే అవుట్ అన్నారు.. రాజమౌళి గురించి నాని ఆసక్తికర విషయాలు..

Eega 2

Eega 2

Eega 2 : ‘ఈగ’ గురించి గుర్తుండే ఉంటుంది. చిన్న కీటకంతో సినిమాను బ్లాక్ బస్టర్ చేశాడు రాజమౌళి ఆయన గ్రేట్ అంటూ అప్పట్లో ప్రశంసలు దక్కించుకున్నారు జక్కన్న. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలో ప్రకటించారు. అయితే, ఈగ వచ్చి చాలా కాలం గడిచింది కాబట్టి సీక్వెల్ ఎప్పుడో నాని చెప్పారు. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ 29న రిలీజ్ అవుతోంది. వివేక్‌ అత్రేయ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యలో నాని వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళికి, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి నాని చెప్పుకచ్చారు.

‘ఈగ వచ్చి చాలా కాలం గడించింది. నేను ఎప్పుడూ విజయేంద్ర ప్రసాద్ గారిని ఈగ సీక్వెల్ ఎప్పుడు అని అడగలేదు. కానీ, రాజమౌళి గారితో మాత్రం సరదాగా మాట్లాడాను. ‘ఈగ2’ అన్నారు కదా.. ఎప్పుడు అని అడిగాను. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘మేము ఈగ2’ చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు..! అదే సీక్వెల్‌లో వస్తుంది’ అని చెప్పారు. ‘ఈగ’ చేయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాలి. సీక్వెల్‌ గురించి ఆలోచన వచ్చినప్పుడే ఆ పనులు ప్రారంభిస్తారనుకుంటా. అదే జరిగితే మరో అద్భుత సినిమాతో ఆకర్షిస్తారు’ అన్నారు. నాని-సమంత కాంబోలో వచ్చిన ఈగ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. విజువల్‌ వండర్‌గా ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. 2012లో రిలీజైన ఈ సినిమా 2 జాతీయ అవార్డులు, 3 సైమా, 5 సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకుంది.

హేమ కమిటీపై నాని ఏమన్నారంటే?
మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, హేమ కమిటీ నివేదికపై నాని  స్పందించారు. ‘హేమ కమిటీ నివేదిక చూసి షాకయ్య. మహిళలపై లైంగిక వేధింపుల గురించి తెలిస్తే.. మనం దారుణమైన పరిస్థితుల్లో బతుకున్నాం అనిపిస్తోంది. కోల్‌కతాలో లేడీ డాక్టర్ పై ఘటన నన్ను కలచివేసింది. గతంలో నిర్భయ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఫోన్‌ను స్క్రోల్‌ చేయాలంటే ఇలాంటి వార్త ఏది కనిపిస్తుందో అని భయపడుతున్నా. సోషల్ మీడియా వాడకం కూడా ప్రమాదమే. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి విన్నప్పుడు బయటకు రాలేకపోతున్నా. 20 ఏళ్ల క్రితం పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అప్పడు మహిళలకు రక్షణ ఉండేది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు దారుణంగా ఉన్నాయి’ అని చెప్పారు.

Exit mobile version