Upasana-Ramcharan : అందుకే ఇన్నాళ్ల తర్వాత బిడ్డను కన్నాం.. చరణ్ తో వైవాహిక బంధంపై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Upasana-Ramcharan : మెగా ఇంటి పెద్ద కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి మనకు తెలిసిందే. ధనవంతుల ఇంట్లో పుట్టి..మరో ధనవంతుల ఇంటికి వెళ్లిన ఆమె సింపిల్సిటీ, మానసిక పరిణితి, సామాజిక సేవా దృక్పథం అందరినీ కట్టిపడేస్తుంది. ఆమె ప్రవర్తన, నడవడిక ద్వారా అటు పుట్టింటికి, ముఖ్యంగా ఇటు మెట్టినింటికి పేరు తెస్తోంది. రామ్ చరణ్ భార్యగా ఆమె నడుచుకునేతీరు.. ఆయన వెన్నంటి ఉండే తీరును అభినందించకుండా ఉండలేం. ఆమె ఎప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నా.. ఇంటర్వ్యూల్లో పాల్గొనడం అరుదు. తాజాగా ఓ బుక్ లాంచ్ సందర్భంగా ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చరణ్ తో బాండింగ్, కూతురు క్లింకార సంగతులను ఎన్నెంటినో చెప్పుకొచ్చింది.
పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు కదా..ఎలా ఫీలవుతున్నారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు..‘‘ అందరూ తల్లి కావడం గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నా.. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు లాంటి కామెంట్స్ నా దృష్టికి కూడా వచ్చాయి. ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మేం అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలని అనుకున్నాం. అందుకే ఇన్నేళ్లు పట్టింది.’ అని ఉపాసన చెప్పుకొచ్చింది.
ఇక భర్త రామ్ చరణ్ తో బాండింగ్ గురించి అడగ్గా..‘‘రామ్ ఎప్పుడూ కూడా ‘ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం’ అని అంటుంటాడు. అలానే మేం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం, మా ఇద్దరి మధ్య హద్దులు(బౌండరీస్) కూడా ఉంటాయి. కెరీర్ విషయంలో ఒకరి దానిలో మరొకరం కల్పించుకోం. కానీ వ్యక్తిగత జీవితం విషయానికొచ్చేసరికి మాత్రం ఒక్కటిగా ఉంటాం’’ అని వెల్లడించింది.
2012లో రామ్ చరణ్- ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో వీళ్ల జంటపై ట్రోల్స్ వచ్చాయి. కానీ రానురాను ఉపాసన మెగా ఫ్యాన్స్ కే మిగతా వాళ్లకు కూడా ఆదర్శ ప్రాయంగా మారింది. మెగా ఫ్యామిలీలో ఉపాసనకు ప్రత్యేక స్థానం ఉంది. మెగా కోడలిగా బరువైన బాధ్యతను మోస్తునే.. తన కెరీర్ ను సైతం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తోంది.