Most Remake Movie : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అతి ఎక్కువగా రీమేక్ చేసిన సినిమా ఇదే.. మన తెలుగు సినిమానే..
Most Remake Movie : సినిమాల్లో కథలకు కొదువ ఉండదు. కానీ ఏ కథను జనాలు ఆదరిస్తారో..ఏ కథను ఆదరించరో ఎవరూ చెప్పలేరు. అందుకే ఒక్కొక్కసారి కథ బాగున్నా కూడా హిట్ కావు.ఇది గతంలో ఎన్నో సార్లు నిరూపితమైంది కూడా. అందుకే మూవీ మేకర్స్..మినిమం గ్యారెంటీ రూట్ లో వెళ్తుంటారు. రెడీ మేడ్ కథలతో సినిమా తీసి రిస్క్ తక్కువ ఉండేలా చూసుకుంటారు.
అందుకే ఏదన్నా భాషలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే దాన్ని రీమేక్ చేస్తుంటారు. మన తెలుగులో కూడా ఎన్నో రీమేక్ సినిమాలు వస్తుంటాయి. రీమేక్ సినిమాలను మన దగ్గర వెంకటేశ్ బాగా చేస్తుంటారు. ఆయన సినిమాల్లో సక్సెస్ రేట్ వీటికే ఉంది. చంటి, సూర్యవంశం, రాజా, దృశ్యం..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా చాలానే రీమేక్ లు చేశారు. అయితే రీమేక్ లు కూడా చాలాసార్లు బోల్తా కొడుతుంటాయి.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాను ఎక్కువ భాషల్లో రీమేక్ చేశారో తెలుసా? అది కూడా మన తెలుగు సినిమానే? ఇది నిజమా అనుకుంటున్నారు కదా. అవును.. ఇప్పటి వరకూ అతి ఎక్కువ భాషల్లో రీమేక్ చేసింది మన తెలుగు సినిమానే. సిద్ధార్థ్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గుర్తుండే ఉంటుంది.
అదేనండి ‘‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’. గుర్తుకు వచ్చింది కదా.. ఈ మూవీ మ్యూజికల్ హిట్టే కాదు.. మంచి లవ్ స్టోరీ, సెంటిమెంట్, ఎమోషనల్, కామెడీ.. ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్ ఈ మూవీలో కనపడుతాయి. అలాగే తెలుగింటి అమ్మాయిగా త్రిష అందాలు బోనస్ అనుకోండి. అప్పట్లో ఈ మూవీ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ మూవీ 2005లో రిలీజ్ అయ్యింది. నిర్మాత ఎంఎస్ రాజు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై నిర్మించారు. ఈ మూవీ కథ కూడా ఆయనే అందించారు. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఆయనకు దర్శకుడిగా ఇదే తొలిసినిమా. రొమాంటిక్ లవ్ డ్రామాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా విజయవంతమైంది.
ఈ సినిమాను ఏకంగా 9 భాషల్లో రీమేక్ చేయడం విశేషం. అన్ని వెర్షన్లలో ఇది తప్పా ఇన్ని భాషల్లో రిలీజ్ చేసిన రీమేక్ లేదనే చెప్పాలి. అయితే ఇది కూడా 1989లో వచ్చిన సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ ‘మైనే ప్యార్ కియా’ ప్రేరణతో వచ్చిన మూవీ. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సిరి, శ్రీరామ్ చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. అయితే వారి ప్రేమను హీరో తల్లి వ్యతిరేకిస్తుంది. హీరోయిన్ అన్న కూడా హీరో ప్రేమను టెస్ట్ చేస్తాడు. ఈ కథంతా మీకు తెలిసిందే కదా..
ఈ మూవీతో త్రిష స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అప్పటినుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, నటి, సంగీత దర్శకుడు..ఇలా ఎన్నో విభాగాల్లో ఫిల్మ్ వేర్ అవార్డులు అందుకుంది. ఈ సినిమా తమిళంలో ‘ఉనక్కుమ్ ఎనక్కుమ్ ’గా, కన్నడలో ‘నేనెల్లో నానల్లేగా’, బెంగాలీలో ‘ఐ లవ్ యుగా’, మణిపురిలో ‘నింగోల్ థాజబాగా’, ఒడియాలో ‘సునా చదేయ్ మో రూపా చదోయ్’గా, నేపాలీలో ‘ది ప్లాష్ బ్యాక్: ఫర్కేరా హెర్డా’గా, హిందీలో ‘రామయ్యా వస్తావయ్యా’గా రీమేక్ అయ్యింది.