New Movies : ఈవారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయే సినిమాలు ఇవే.. ఈ కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడేనా?
New Movies : గత నెల చివరన విడదలైన ప్రభాస్ కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎన్నో రికార్డులతో ఈ సినిమా థియేటర్లను కళకళలాడించింది. అదే జోరును జూలైలో కొత్త సినిమాలు కూడా కొనసాగిస్తాయని బయ్యర్లు , ఎగ్జిబిటర్లు ఆశగా ఎదురు చూసినా నిరాశ తప్పలేదు. కల్కి సినిమా తో జూలై మొదటి వారం అందరూ వదిలేసుకున్నారు. రెండో వారంలో వచ్చిన భారతీయుడు -2 రెండో రోజు కూడా థియేటర్లు నిండలేదు. తెలంగాణలో టికెట రేట్ల పెంపు మరింత దెబ్బతీసింది. ఆ తరువాత వచ్చిన ప్రియదర్శి డార్లింగ్ కూడా నిరాశనే మిగిల్చింది. ప్రమోషన్లతో ఆకట్టుకున్న పేకమేడలు, ది బర్త్ డే బాయ్ సైతం ప్రభావం చూపలేకపోయాయి.
ఇక చివరి వారం బాకీ ఉంది. ఈ శుక్రవారం ముక్కోణపు పోటీ కనిపిస్తున్నది. వాటిలో ముందు వరుసలో ఉన్నది తమిళ డబ్బింగ్ సినిమా రాయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ ఈసినిమాలో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఎస్ జే సూర్య విలన్ రోల్ చేశాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం మరింత ఆకర్షణ. కానీ తెలుగులో మాత్రం ఆ స్థాయిలో బజ్ ని తీసుకురాలేకపోతున్నాయి. తమిళనాడు బుకింగ్స్ మాత్రం అదరగొడుతున్నాయి. తెలుగులో హైదరాబాద్ మినహా మిగతా చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో టికెట్లు తెగడం లేదు. మహారాజ తరహాలో టాక్ వస్తే సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది.
ఇక రాజ్ తరుణ్ పురుషోత్తముడు కూడా ఈ శుక్రవారం(జూలై26) విడుదల కానుంది. హీరో లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లు కానిచ్చేశారు. పెద్ద క్యాస్టింగ్, టాప్ టెక్నీషియన్లు పని చేసిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం ఇచ్చారు. హడావిడి లేకపోయినా టాక్ తో జనమే తమకు పబ్లిసిటీ చేస్తారని టీమ్ నమ్ముతున్నది. పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా చేసిన ఆపరేషన్ రావణ్ కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఈ మూవీని తెరకెక్కించారు. వీటితో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. కానీ అవేంటో కూడా ప్రేక్షకుల్లో తెలియదు. ఈ వారం మూడు ముక్కలాటలో ఎవరు పై చేయి సాధిస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది.