Surya Daughter : సూర్య తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగులో కూడా చాలా ఫేమస్. సూర్య హిరోయిన్ జ్యోతికను పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. జ్యోతిక పెళ్లి అనంతరం అడపాదడపా సినిమాల్లో కనిపించిందే తప్పా.. మొత్తం దూరం కాలేదు. సూర్య గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. సూర్యతో పాటు చంద్రముఖి సినిమాతో జ్యోతిక కూడా చేరువైంది.
సూర్య నటించిన 24, గజిని, సూర్య సన్నప్ కృష్ణన్, 7th సెన్స్ మూవీలు ఒక అద్భుతం. విలక్షణమైన నటన. కథలో బలం ఉండి కంటెంట్ కొత్తగా ఉంటేనే సూర్య సినిమాలు చేయడానికి ఒప్పుకుంటాడు. ప్రేక్షకులు ఎప్పుడూ కోరుకునే కొత్తదనం.. సూర్య కూడా తన సినిమాల్లో ఉండాలని కోరుకుంటాడు. అందుకే విలక్షతకు పెట్టింది పేరు. క్రియేటివిటీ ఉన్న మూవీలను ఎంచుకోవడంతో సూర్య తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఒక్క సారి సూర్య హిరోగా నటించిన మూవీలను చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది.
సూర్య, జ్యోతిక ల కూతురు దివ్యా ఇంటర్ ఇంటర్ చదువుతోంది. ఇంటర్ రిజల్ట్ లో ఆమెకు మంచి మార్కులు వచ్చాయి. 12 వ క్లాస్ జనరల్ ఎగ్జామ్స్ లో రిజల్ట్ రాగా.. ఫస్ట్ క్లాస్ లో నిలిచి సత్తా చాటింది. సెలబ్రెటీల పిల్లలు సరిగా చదవరు అనే అపోహ ఉంటుంది. కానీ సూర్య కూతురు మాత్రం చదువులో మంచి స్టూడెంట్ గా ఉంది.
రిజల్ట్ లో మొత్తం 600 మార్కులకు గాను 581 మార్కులు దియాకు వచ్చాయి. మొత్తంగా 96 .83 శాతంతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇంటర్ లోనే కాదు.. గతంలో ఎస్సెస్సీ ఎగ్జామ్స్ లో కూడా దియా మంచి ప్రతిభ కనబర్చింది. పదో తరగతిలో 97 శాతం పర్సంటేజీ సాధించి తన సత్తా నిరూపించుకుంది. దీంతో జ్యోతిక, సూర్యలు తెగ ఆనందపడిపోతున్నారు. అయితే సూర్య ప్రస్తుతం కంగువ అనే మూవీ చేస్తున్నాడు. కంగువ మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా డ్రామా మూవీ అని తెలుస్తోంది.