sand stain : జగన్ హయాంలో ఇసుక దందాలో అడ్డగోలుగా దోపిడీ జరిగింది. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సహజ సంపదను ఆదాయ వనరుగా మార్చుకుని కోట్లు కొల్లగొట్టారు. నిబంధనలను తుంగలో తొక్కి తమకు కావాల్సినంత ఇసుకను తవ్వి… సొమ్ము చేసుకున్నారు. ఐదేళ్లు పాటు ప్రజలకు చుక్కలు చూపించారు. ఇసుక దందాలో తాడేపల్లి వరకు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వేల కోట్లు దోచుకున్నారనేది బహిరంగ రహస్యం. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు జగన్ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించారు. ఇకపై ఇసుక కష్టాలు ఉండవని అందరూ భావించారు. కానీ ప్రజలకు ఆశించిన మేర దీని నుంచి ఊరట లభించలేదు. కొన్ని చోట్ల గతంలో కంటే ఇప్పుడు భారంగా ఉందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత ఇసుక ఆలోచన మంచిదే అయినప్పటికీ, ప్రజల కష్టాలను పూర్తిగా తొలగించలేకపోవడానికి దాని అమలులో ఉన్న ఇబ్బందులే ప్రధాన కారణం. ఇసుక ఉచితం అయినప్పటికీ రవాణా, హ్యాండ్లింగ్ చార్జీల వసూళ్లలో ఏకరూపత లేకపోవడం, వర్షాకాలం కారణంగా ఇసుక రీచ్‌లకు పూర్తి స్థాయిలో లభ్యం కాకపోవడం, సరిపడా స్టాక్ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీని వల్లే జనాల మీద అదనపు భారం పడుతోంది.
వీరబాబు అనే వ్యక్తి కోటిలింగాల స్టాక్ పాయింట్ వద్ద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి పనసపాడుకు 20 టన్నుల ఇసుకను బుక్ చేశాడు. ఇసుకకు రూపాయి కూడా వసూలు చేయలేదు. కానీ రవాణా ఛార్జీ 9,276. మరో 7,363.81 రూపాయలు ఇతర చార్జీలు ఉన్నాయి. వారు దేనికి వసూలు చేస్తారో బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. 20 టన్నుల లారీకి 16,640 రూపాయలు వసూలు చేశారు. 20 టన్నుల ఇసుకకు జీఎస్టీ, ఇతర చట్టబద్ధమైన రుసుము ఎంత? మహా అయితే 2300 రూపాయల వరకు ఉంటుంది. ఆ వివరాలు చెప్పకుండానే ఇతర చార్జీల పేరుతో వినియోగదారుడి నుంచి రూ.7,363.81 వసూలు చేశారు. అంతకు ముందు జగన్ హయాంలో 14,500 రూపాయలకు ఇసుక దొరికేదని ఇదే ప్రాంతానికి చెందిన ప్రజలు చెబుతున్నారు. అంటే గత సారి కంటే ఇప్పుడు 2,140 రూపాయలు ఎక్కువైందన్నది వారి లెక్క. ఇతర చార్జీలు ఎందుకు ఎక్కువ అని ప్రశ్నిస్తే.. అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు రూ.4,811, స్టాట్యూటరీ ఫీజులు రూ.1,760, జీఎస్టీ రూ.762 అని అధికారులు చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ‘ఉచితం’ అంటే… ప్రజలపై భారం పడకూడదు. జగన్ ప్రభుత్వంలో మాదిరిగా ప్రజలకు ఇసుక కష్టాలు ఉండకూడదు. గతంలో ఇష్టానుసారం సాగిన దోపిడీకి బ్రేక్ పడాలి. వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఇసుక తీసుకెళ్లాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అప్పుడూ ఇప్పుడూ అవే ధరలు. చిత్రంగా కొన్నిచోట్ల ఇంకా అధిక ధరకు ఇసుక కొనవల్సి వస్తోందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.