Producer Danaiah : అదేదో సినిమాలో ఒక డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఆ గుండె పది గుండెలను రక్షిస్తుంది.. ఆ గుండె బతకాలి అని ఈ డైలాగ్ రీల్స్ లో కూడా బాగా ఫేమస్. ఈ డైలాగ్ ప్రొడ్యూసర్ దానయ్యకు సరిగ్గా సరిపోతుంది. లేకపోతే పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిని హీరోగా పెట్టి సినిమా చేసి, సినిమాకు రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడంటే మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడిదే హాట్ టాపిక్.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో, ఎప్పుడు వారాహి ఎక్కుతాడో, ఏ సభ ఎప్పుడు నిర్వహిస్తాడో తెలియదు. ఒకవేళ వచ్చినా సెట్స్ పైకి వచ్చినా ఏ సినిమానో అస్సలు తెలిసే అవకాశమే లేదు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ సినిమాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇలాంటి క్రూషియల్ టైమ్ లో #OG సెప్టెంబర్ 27వ వస్తుందంటూ దానయ్య ప్రకటించాడంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.
#OG చాలా భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మిగతా సినిమాలతో దీన్ని పోలిస్తే, ఇదే రిలీజ్ కు ముందుంది. కేవలం 20 రోజుల కాల్షీట్లు ఇస్తే చాలు బ్యాలెన్స్ పార్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవచ్చు. అంత మాత్రానికే రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఎట్లా? నిజంగా పవన్ కళ్యాణ్ ను సంప్రదించే తేదీ ప్రకటించారా? లేక ఆయనపై ఒత్తిడి పెంచే ప్రయత్నమా?
పవన్ మామూలోడు కాదు. ఆయనపై ఒత్తిడి పెంచుదామనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. కాబట్టి పవన్ ను సంప్రదించే డేట్ అనౌన్స్ చేసి ఉంటాడు. అయినప్పటికీ ఆ డేట్ పోస్ట్ పోన్ కాదనే గ్యారెంటీ లేదు.
ఈ విషయంలో దానయ్య కాస్త ముందు చూపుతో వ్యవహరించాడు. ఏపీ ఎన్నికలు, ఆ తర్వాత పరిణామాలను లెక్కలేసుకొని దానయ్య ఈ డేట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. పైగా మంచి డేట్స్ అన్నీ ముందే రిజర్వ్ అయిపోతున్న నేపథ్యంలో.. ఓ తేదీ ముందుగానే ప్రకటిస్తే పడి ఉంటుందనే ఆలోచన కూడా మంచిదే. #OG చెప్పిన తేదీకి వస్తుందా? రాదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పోస్టర్ తో పండగ చేసుకుంటున్నారు.