T-20 World Cup: పాండ్యాను సెలక్ట్ చేయొద్దన్న రోహిత్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

T-20 World Cup

T-20 World Cup, Rohith VS Pandya

T-20 World Cup : ఏ ముహూర్తాన ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలక్ట్ చేసిందో గానీ ఆ జట్టు యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను బాధ్యతల నుంచి తొలగించి పాండ్యాను తీసుకురావడం ఆ జట్టుకు తీరని నష్టాన్ని చేకూరుస్తోంది. కెప్టెన్ మార్పు ఆటగాళ్లలో విభేదాలు తీసుకురావడమే కాదు..ఆ ప్రభావం ఆటపై పడింది. ప్రముఖ ఆటగాళ్లు ఎందరో ఉన్న ఆ జట్టు ప్లేఆఫ్స్ ఈజీగా వెళ్లేది. కానీ కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల విభేదాలతో పాయింట్ల లిస్ట్ లో కిందకు వెళ్లింది.

ఐపీఎల్ చివరి దశకు దగ్గరలో ఉన్నా హార్దిక్, రోహిత్ విభేదాలు మరింత ముదిరాయే తప్ప తగ్గలేదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని తెలుస్తోంది. ఈ ఐపీఎల్ లో పాండ్యా సారథ్యంలో రోహిత్ ఆడుతుండగా..టీ-20 వరల్డ్ కప్ లో రోహిత్ సారథ్యంలో పాండ్యా ఆడాల్సి ఉంది. ఈనేపథ్యంలో ప్రపంచకప్ కు పాండ్యాను ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ..చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు సూచించాడని ఓ జాతీయ వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.

అయితే హెడ్ కోచ్ ద్రావిడ్ తో పాటు ఇతర సెలెక్టర్ల సూచనలతో రోహిత్ సరే అన్నట్లు సమాచారం. అంతే కాకుండా టీ-20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటిస్తాడని కూడా ఆ వెబ్ సైట్ చెప్పుకొచ్చింది. ప్రత్యామ్నాయ ఆటగాడు లేకనే పాండ్యాను జట్టులోకి తీసుకున్నామని అగార్కర్ మీడియాకు చెప్పాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ లో పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ తీవ్రంగా నిరాశపరిచాడు.

మరి త్వరలో జరుగబోయే కీలక ప్రపంచ కప్ లో ఎలా ఆడుతాడోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఐపీఎల్ వివాదాలను అక్కడ కంటిన్యూ చేస్తే మాత్రం జట్టుకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. కీలక ఆటగాళ్లు రోహిత్, సూర్య, పాండ్యా, బుమ్రా ప్రపంచకప్ లో ఫెయిల్ అయితే మాత్రం జట్టుకు కష్టాలు తప్పవు. ఒక్క విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉండడం మాత్రమే టీమిండియాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రముఖ ఆటగాళ్లు ప్రపంచకప్ లోనైనా విభేదాలు పక్కనపెట్టి కప్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

TAGS