Renu Desai : రేణు దేశాయ్ కు సురేఖ సారె..  ఆ విషయంపై కొనియాడిన మంత్రి

Renu Desai

Renu Desai

Renu Desai : సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్న నటీమణుల్లో రేణు దేశాయ్ ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇద్దరు పిల్లలతో విదేశాలలో గడిపిన ఆమె ఆ తర్వాత ఇండియాకు వచ్చి సామాజిక, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వణ్యప్రాణులు, వాటి బాగోగుల కోసం సమయం వెచ్చిస్తున్నారు. దీంతో పాటు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు సలహాదారుగా కూడా ఆమె కొనసాగుతున్నారు. మంచి నటే కాకుండా.. అనేక సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలను అందుకుంటున్నారు.

సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం (జూలై 26) రోజున హైదరాబాద్ కు వచ్చిన రేణు దేశాయ్ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె ఇంటికి వెళ్లిన నటి చాలా సేపు మంత్రితో ముచ్చటించారు. తను సామాజిక సేవ చేస్తున్న రెండు రంగాలకు సురేఖనే మంత్రి కావడంతో పలు విషయాలను చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారి ఏర్పాటు చేయనున్న గీత విశ్వవిద్యాలయానికి సంబంధించి వివరాలను రేణు దేశాయ్ మంత్రికి వివరించారు.

తన ఇంటికి వచ్చిన రేణు దేశాయ్‌ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్లతో సారె ఇచ్చి సత్కరించారు. తెలంగాణ ఆడబిడ్డకు పెట్టిన విధంగా సారె, చీర అందజేశారు. రేణు దేశాయ్ సినిమాలో కాకుండా బయట ఆమె సేవలు అద్భుతమన్న మంత్రి సురేఖ ఆమె పలు విషయాలపై వివరించారని, శాఖా పరంగా పరిశీలిస్తానని అన్నారు. సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును మంత్రి రేణు దేశాయ్‌కి మంత్రి అలంకరించారు.

TAGS