Italy PM : ఇటలీ ప్రధానిపై పోస్టు.. జర్నలిస్టుకు జరిమానా

Italy

Italy PM

Italy PM : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పరువుకు భంగం కలిగించినందుకు ఓ జర్నలిస్టు చిక్కుల్లో పడ్డారు. నష్టపరిహారం కింద ప్రధానికి 5 వేల యూరోలు చెల్లించాలంటూ మిలాన్ న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

2021లో జర్నలిస్టు గిలియా కార్టిసి.. మెలోనీపై ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తూ ఎత్తును ఉద్దేశించి హేళన చేశారు. ‘‘మెలోనీ మీరు నన్ను భయపెట్టలేరు. మీ ఎత్తు కేవలం 1.2 మీటర్లు (నాలుగు అడుగులు) మాత్రమే. మీరు అసలు నాకు కనిపించరు’’ అని వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. దీనిపై మెలోనీ కేసు పెట్టారు. కేసును విచారించిన మిలాన్ కోర్టు తాజాగా సదరు జర్నలిస్టుకు 5 వేల యూరోల జరిమానా విధించింది. అయితే తీర్పుపై కార్టిసి అప్పీల్ చేసుకోవడానికి వీలుంది. ఒకవేళ ఈ జరిమానా డబ్బులు అందితే ప్రదాని వాటిని ఛారిటీకి ఇస్తారని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.
TAGS