MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, అరవింద్ కేజ్రీవాల్, కవితకు కూడా వస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఛార్జిషీట్ వేశాక జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. జైలులో కవిత 11 కిలోల బరువు తగ్గారని, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవితను కల్వకుంట్ల సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. మంగళవారం (ఆగస్టు 7) మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి కవితను కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు.