Sensex : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9.22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతో7ంది. డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ.83.72 వద్ద ప్రారంభమైంది.
లార్జ్ క్యాప్ స్టాక్స్ లోని ఒడిదుడుకుల నేపథ్యంలో అమరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర రూ.82.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం నికరంగా రూ.2,605 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,432 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.