Child artist : మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా? షేకింగ్ ఫొటో

Manasantha Nuvve child artist
Manasantha Nuvve child artist : తెలుగులో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ప్రేమకథ చిత్రాల్లో మనసంత నువ్వే ఒకటి. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ హీరోగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ అలాగే ఉందంటే అతిశయోక్తి కాదు. ఉదయ్ కిరణ్ కెరీర్ నే మలుపు తిప్పిన సినిమా ఇది. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించగా, వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
ఉన్నత విద్యనభ్యసించిన సుహాని ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా బైబై చెప్పేసింది. ప్రస్తుతం ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్ ఫ్లుయెన్సర్ గా చేస్తున్నది. ప్రస్తుతం సుహాని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్టుగా అమాయకంగా కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు గ్లామర్ డోస్ తో హల్చల్ చేస్తున్నది. ఈ బ్యూటీ ఫోటోలు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. తూనీగా తూనీగా అంటూ ఆడిపాడిన చిన్నారి ఈ రేంజ్ లో మారిందేంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.