హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర ఆమె స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌ను నడుపుతున్న కుమారి ఆంటీ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. సామాజిక మాద్యమాల్లో కుమారి ఆంటీ తెగ పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్ప డటంతో హోటల్ ను ముసివేయించారు.. ఈ విషయం ఆనోటా ఈనోటా సీఎం కార్యాయలయం వెళ్లడంతో రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె వ్యాపారాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన కుమారి ఆంటీని బిగ్‌బాస్-8 సీజన్లో తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా కంటెస్టెంట్‌గా ఆమెను తీసుకుంటే షోకు పాపులారిటీ వస్తుందని నిర్వా హకులు భావిస్తున్నారని సమాచారం అందుతుంది.