KTR Power Point Prasentaion:తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన సువర్ణాధ్యాయం:కేటీఆర్
KTR Power Point Prasentaion:తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గులాబీ పార్టీపై సంచలన ఆరోపణలు చేయడం, శ్వేతపత్రాన్ని విడుదల చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. `కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ`తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని, గత పది సంవత్సరాలు సృష్టించే విధంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. మా పార్టీ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, హరీష్‌రావు, పార్టీ తరుపున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలు, కొన్ని విమర్శలకు ధీటుగా సామాధానం చెప్పాను కాబట్టే మాకు సావధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కింది` అంటూ ఫైర్ అయ్యారు.
అందుకే స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నాం…
చివరకు శ్వేతపత్రాలు హడివిగాగా చేసి ఆఖరికి వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయిన విషయాన్ని మీరు చూశారు. అయితే వాళ్లు లేవనెత్తిన కొన్ని సందేహాలు, చేసిన ఆరోపణలు ఇవన్నింటి విషయంలో బాధ్య కలిగిన పార్టీగా గత పదేళ్లు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది? ఎట్లా జరిగింది? ప‌్రజలకు వివరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నాం. పదేళ్లు చమటోడ్చి, రక్తాన్ని రంగరించి..వందల, వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం మాత్రమే కాదు..లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడ్డారో..ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో చెప్పాల్సిప బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉన్నది. ఎక్కడికి చేరుకున్నామో తెలియాలి అంటే,.. ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి` అన్నారు.
భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యాయం..
అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం వైపు..సంక్షభం వైపు సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం..కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యాయం. 60 ఏళ్ల సమైక్య పాలన..60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే.. మరి నేరపూరిత నిర్లక్ష్యంతో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం అప్పటి పాలకులు చేశారు.
అది కాంగ్రెస్ పాలకులు కావొచ్చు. ఇతరులు కావొచ్చు.. వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం.. పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. అందుకే మాటల్లో కంటే కూడా..ఆనాటి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన `తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్` పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. దాన్ని చూస్తే కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది` అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.