JAISW News Telugu

KTR : కవిత కోసం వారిని కలిసిన కేటీఆర్.. ఇంతకీ వారితో ఏం మాట్లాడారంటే?

KTR

KTR

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా లిక్కర్ స్కామ్ లో అరెస్టయి మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితతో ములాఖాత్ కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పీకల్లోతుల్లో కూడుకుపోయి జైల్ లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు.

కవితతో ములాఖాత్
కవిత ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ విచారించారు. ఈ ములాఖాత్ నేపథ్యంలో కవిత బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలపై కవితతో ఆయన చర్చించనున్నారు.

డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ పై వాదనలు
తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు వాదనలు విన్నది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే దానిపైన కోర్టు విచారించనుంది. ఈ క్రమంలోనే కేటీఆర్, కవిత భర్త అనిల్ నేడు ఢిల్లీలో భేటీలు అయ్యారు.

న్యాయవాదులతో భేటీ
కవిత కేసును వాదిస్తున్న న్యాయవాదులు (లాయర్ల)తో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. బెయిల్ వచ్చే అంశంపై న్యాయవాదులతో కేటీఆర్ చర్చించినట్టు సమాచారం. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు.

ఫిరాయింపులపై చర్చ..
ఇదే క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సుప్రీంలో వాదించిన న్యాయవాదులతో భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే పార్టీ మారిన 10 మంది కోసం స్పీకర్, గవర్నర్ ను కలిశారు బీఆర్ఎస్ ప్రతినిధులు. కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ కవిత అనారోగ్యం నేపథ్యంలో కేటీఆర్ నేడు ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ కానున్నారు. దీంతో ఈ రోజు కవిత కేసులో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ చోటు చేసుకుంది.

Exit mobile version