Top 10 worst food : ప్రపంచ ఆహారంతో పోలిస్తే భారతీయ ఆహారం రుచిగా ఉంటుంది. దీంతో పాటు చాలా పోషక విలువలు కలిగిన ఏకైక ఆహారం ఇండియన్ ఫుడ్. అయితే ఇందులో కొన్ని మంచివి కొన్ని తినేందుకు ఇష్టపడనివి ఉంటాయి.
ఇండియన్ ఫుడ్ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం. అనేక రుచులు, అనేక ఆహారపు అలవాట్లు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కోట్లాది మంది ప్రతి రోజూ లక్షలాది రకాల వంటకాలను వండుతారు. ఆహారపు అలవాట్లు రాష్ట్రాన్ని కాదు కాదు.. జిల్లా, నగరాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి.
‘టెస్ట్ అట్లాస్’ అనే సంస్థ ఇటీవల వరస్ట్ ఫుడ్ జాబితాను రెడీ చేసింది. భారతీయ వంటకాల జాబితాను సిద్ధం చేశారు. అందులో చెత్త ఆహారాల పేర్లను లిస్టవుట్ చేశారు. అందులో తెలుగు వంటకాలు ఉన్నాయి.
జనం ఎక్కువగా ఇష్టపడని 10 రకాల ఆహార పదార్థాల జాబితాలో ఏవి ఉన్నాయో చూద్దాం.. జల్జీరా, తెంగై సాదమ్, గజక్, చర్గాయ్, అచ్చప్పం, ఆలు వంకాయ కూర, మాల్పోవా ఉప్మా, మిర్చి కా సలాన్ ఉన్నాయి. వీటితో పాటు మరో ఫుడ్ ఉంది. దాని పేరు వింటే ఆశ్చర్యపోతారు.
సంస్కృతిక, పోషకాలతో కూడిన బెంగాలీ ఆహారంను ఈ జాబితాలో చేర్చారు. దీంతో బెంగాలీ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టేస్ట్ అట్లాస్‌లోని చెత్త ఆహారాల లిస్ట్ లో ఆ ఆహారాన్ని చేర్చడాన్ని చాలా మంది అంగీకరించడం లేదు.
అది ఏంటంటే అన్నం. నెటిజన్లు కొందరు రేటింగ్‌ల ఆధారంగా ప్రశ్నించగా, మరికొందరు అటువంటి జాబితాలను రూపొందించడం కరెక్టేనా? అంటూ ప్రశ్నించారు.
‘ఎక్స్’ వినియోగదారుడైన ఒకరు పాంటా బాత్ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని కామెంట్ చేశాడు. టెస్ట్ అట్లాస్ ఇకపై అటువంటి జాబితా ప్రచురించద్దని, మరొక వినియోగదారు సూచించారు.
పాంటా భాత్ అంటే మరేదో కాదు చద్దన్నం. వండిన అన్నాన్ని.. నీటిలో నానబెట్టి వివిధ రకాల పచ్చళ్లు, పొడులు, కూరలను నంచుకొని తింటారు. బెంగాల్లో దీన్నే పాంటా భాత్ అంటారు. మన తెలుగు వారు చద్దిన్నం, లేదా గంజి అన్నం అంటారు.
రేటింగ్ ఏం చెప్పినా, భారత ఉపఖండంలో ప్రజల మనస్సును పాంటా భాత్ గెలుచుకుంది. రుచిలోనే కాదు, వీటిలో అనేక రకాల పోషక విలువలు ఉంటాయి.