చంద్రుడి మొక్క ఆకారం, రంగు భూమిపై ఉండే వాతావరణ స్థితి ద్వారా మనకుకనిపిస్తుంటుంది. కశ్మీర్ లో చల్లని , పొడి గాలి చంద్రుడిని ప్రకాశవంతంగా మనకు చూపిస్తుంది. కన్యాకుమారిలో తేమ కలిగిన గాలి చంద్రుడు ప్రకాశవంతంగా మనకు కనిపిస్తాడు. పట్టణాల్లో చూసుకుంటే కాలుష్యం కారణంగా చంద్ర క్రాంతి మనకు కొంత తక్కువగా కనిపిస్తుంది. అదే పల్లెల్లో ప్రకాశవంతంగా స్పష్టమైన చంద్రుడు కనులవిందుగా దర్శనమిస్తాడు. రాత్రివేళల్లో చంద్రుడిని చూస్తూ జంటలు, వివిధ కథలు చెప్పుకుంటూ పిల్లలు, పెద్దలు సేదతీరుతుంటారు.
పున్నమి రోజున చంద్రుడు విపరీతమైన ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందరినీ ఆహ్లాదపరిచేలా దర్శనమిస్తాడు. ఇక అమావాస్య రోజున చంద్రుడి జాడే ఉండదు. వివిధ దశలు చంద్రుడి దర్శనాన్ని ప్రభావితం చేస్తాయి. కశ్మీర్ నుంచి చూసే స్థానం, కన్యాకుమారి నుంచి చంద్రుడిని చూసే స్థానం విభిన్నంగా ఉంటాయి. భారత్ లో చంద్రుడికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పూజలు చేస్తారు. దేవుడిలా భావిస్తారు. పండుగలు నిర్వహిస్తారు. చంద్రుడిని బట్టి రైతులు కూడా వ్యవసాయ పనులు నిర్వహిస్తారు. ఏదేమైనా చంద్రుడి దశలను బట్టి అది కనిపిస్తూ ఉంటుంది.