Tirumala : నేటి నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

Tirumala

Tirumala

Tirumala : శ్రీవారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ఈ నేపథ్యంలో 21న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న (మంగళవారం) 75,125 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.41 కోట్తు, మరోవైపు, టైమ్ స్లాట్ ఎస్ఎస్ డి దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా, 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

TAGS