CM Jagan : ఏపీలో సీఎం జగన్ ఉద్దేశం పక్కా అదేనా?

CM Jagan

CM Jagan

CM Jagan : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ రాజకీయం మొదలెట్టారు. ఏ పని చేసినా తన ప్రచారం కనిపించేలా చూసుకుంటున్నారు. రూ.400 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని ప్రారంభోత్సవం కోసం వేలాది బస్సులు ఉపయోగించి సభ నిర్వహించి తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్లను తీసుకొచ్చి తన భజన తానే చేసుకున్నారు.

సొంత తల్లినే పట్టించుకోని కొడుకు ఇప్పుడు ప్రజలను ఏం పట్టించుకుంటారనే వాదనలు వస్తున్నాయి. మీ బిడ్డ మీ బిడ్డను అంటూ అన్ని వర్గాలను ఆకర్షించాలని చూస్తున్నారు. జగన్ ఏదో ఉద్దరించినట్లు బిల్డప్ ఇస్తున్నారు. రూ. 2.5 లక్షల కోట్ల నగదు బదిలీ చేశారు. ప్రతిపక్షాలు ఏం చేయలేదని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణను కూడా రాజకీయం చేయడం గమనార్హం.

తెలంగాణలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో రాజకీయాలు చేయలేదు. అంబేద్కర్ మనవడిని పిలిపించి ఆవిష్కరించారు. అంబేద్కర్ పేరుతో పోటీగా తన పేరు కనిపించేలా రాసుకున్నారు. జగన్ తీరుకు సొంత పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ కార్యక్రమాన్ని అయినా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలు అంటూ వారి మీద లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చవకబారు పనులు చేస్తున్నారు. అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. ఎంతకైనా తెగించాలని చూస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమమైనా తన ఉనికి కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. సొంత చెల్లి, తల్లిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అంటున్నారు.

TAGS