Indian scammer : వృద్ధ అమెరికన్లు లక్ష్యంగా అధునాతన అంతర్జాతీయ స్కామర్లు చెలరేగిపోతున్నారు. వారిని నమ్మించి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. రోజు రోజుకు ఇవి పెరిగి బాధితులకు ఏటా బిలియన్ల కొద్దీ నష్టం జరుగుతోంది. దీనిపై అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొబైల్ కాల్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞాంను ఉపయోగించుకొని ఈ నేరస్తులు ఇంటర్నెట్, టెలిఫోన్ కుంభకోణాల ద్వారా బలహీనతలను టార్గెట్ చేస్తున్నారు. వారి నుంచి లక్షల కొద్దీ డబ్బులను గుంజుతున్నారు.
ఫ్లోరిడాలోని ఓకాలాలో ఇటీవల జరిగిన ఒక కేసులో 70 ఏళ్ల వృద్ధురాలు ఇలాంటి మోసానికే గురైంది. పాల్స్ మెసేజెస్ పంపిస్తూ కన్ ఫ్యూజన్ చేయడంతో ఆమె బలైపోయింది. మొదటి సారి 50 వేల డాలర్లు ఇవ్వాలని వృద్ధురాలిని ఒత్తిడి చేసిన స్కామర్.. తర్వాతి రోజు మరో 30 వేల డాలర్లకు టార్గెట్ చేశారు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం జరిగిన దర్యాప్తులో బాడీ కెమెరా ఫుటేజీ, విచారణ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
సదరు నిందితుడు భారతీయ పౌరుడు. తాను నిర్ధోషి అని మొదట చెప్పుకున్నాడు. కానీ తర్వాత కుంభకోణాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. వ్యవస్థీకృత మోసం, వృద్ధుల నుంచి భారీ చోరీ, దోపిడీల వంటి అభియోగాలను ఎదుర్కొంటున్న అతను అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలతో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసుల విచారణలో బయటపడింది. ఒక్క ఫ్లోరిడాలోనే మొత్తం 80,000 డాలర్లకు పైగా ఆయన అమాయకుల నుంచి వసూలు చేశాడని పోలీసులు చెప్తున్నారు.
జార్జియాలో జరిగిన మరో ఘటనలో అదే ముఠా 80 ఏళ్ల వృద్ధురాలి నుంచి 1,50,000 డాలర్ల విలువైన బంగారాన్ని కాజేసింది. పట్టుబడకుండా తప్పించుకోవడానికి, తాము మోసానికి పాల్పడలేదని వారు చెప్తున్నప్పటికీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో సాక్షాలతో సహా అసలు విషయాలు బయటపడ్డాయి.