Prashant Varma : ‘హనుమాన్’ అనే ఒకే ఒక్క సినిమాతో సౌత్ లోనే పెద్ద స్టార్ డైరెక్టర్స్ లీగ్ లోకి వెళ్ళిపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అతను ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అవ్వడానికి పెద్ద స్టార్ హీరోలతో సినిమాలేమి చెయ్యలేదు. చిన్న హీరోలతోనే సియమాలు చేసుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు ని తెచ్చుకున్నాడు. నేడు చిన్న హీరో తోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి, అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైనా కూడా 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా తన కెరీర్ ప్రారంభం ఇలాంటి అద్భుతాన్ని సృష్టించలేదు. ఇది కేవలం ప్రశాంత్ వర్మ ప్రతిభ కి తార్కాణం లాంటిది. ‘హనుమాన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ అనే చిత్రం కూడా ఉంటుందని, త్వరలోనే షూటింగ్ ని ప్రారంభిస్తాము అంటూ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంటే కాకుండా ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం 12 సినిమాలు ఉంటాయని, సూపర్ హీరో సినిమాలతో పాటు సూపర్ ఉమన్ సినిమాలు కూడా ఉంటాయని ప్రశాంత్ వర్మ ఇది వరకే తెలిపాడు.
‘జై హనుమాన్’ చిత్రం తో పాటుగా, ‘అధీరా’, ‘మహంకాళి’ మరియు బాలయ్య తో ఒక సూపర్ హీరో సినిమా ఉంటుందని తెలిపాడు. అలాగే ‘హనుమాన్’ చిత్రం లో కోటి అనే కోతి క్యారక్టర్ ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ క్యారక్టర్ కి మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అయితే రవితేజ ఒప్పుకుంటే ఈ కోతి క్యారక్టర్ తో ఒక సినిమానే చేస్తానని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు ప్రశాంత్ వర్మ. రాజమౌళి గారు ఈగ తో ఎలా అయితే సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడో , నాకు కూడా కోతి తో అలాంటి సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.
మరి రవితేజ ఒప్పుకొని డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి. ఒకవేళ ఇస్తే మాత్రం ప్రశాంత్ వర్మ తన టాలెంట్ కి మరింత పదును పెడుతాడు అనే చెప్పొచ్చు. ఇకపోతే రీసెంట్ గానే 250 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటిన ఈ సినిమా, 300 కోట్ల రూపాయిల గ్రాస్ వైపు పరుగులు తీస్తుంది. 300 కోట్లు దాటిన తర్వాత కూడా అదనంగా మరో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ సినిమా రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.