Prize Money World Cup : వరల్డ్ కప్ లో విన్నర్, రన్నర్ లకు అందే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Prize Money World Cup Winners : ప్రపంచ కప్ 2023లో భారత్ కు పరాభవం ఎదురైంది. కీలక సమయంలో చేతులెత్తేయడం మనవారికి అలవాటే. మన దేశంలో జరిగిన వరల్డ్ కప్ లో మనం విజయం సాధించకపోవడం కొంత నిరాశే. మన వారు ఏ దశలో కూడా ప్రభావం చూపించలేదు. దీంతో ఆస్ట్రేలియా అన్ని రంగాల్లో ఆధిపత్యం సాధించింది. కప్ కైవసం చేసుకుంది. ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
ప్రపంచ కప్ లో గెలచిన జట్టుకే కాదు రన్నరప్ గా నిలిచిన జట్టుకు కూడా నజరానా దక్కుతుంది. కప్ గెలిచిన ఆస్ట్రేలియాకు రూ. 33 కోట్లు, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ. 16 కోట్లు అందుతాయి. ఈ టోర్నమెంట్ నిర్వహణకు 10 మిలియన్ డాలర్లు ఐసీసీ ఖర్చు చేస్తోంది. మన కరెన్సీలో రూ. 83 కోట్లు అన్నమాట. విజేతకు రన్నరప్ గా నిలిచిన జట్లకే కాదు సెమీ ఫైనల్ ఆడిన జట్లకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లకు రూ.6.5 కోట్లు అందుతాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు రూ.83 లక్షల చొప్పున ఇవ్వనుంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి 240 పరుగులకే కట్టడి చేసింది. మిగతా మ్యాచుల్లో మన బౌలర్లు సత్తా చూపినా ఈ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. ఫలితంగా ఆసీస్ 43 ఓవర్లలోనే లక్ష్యం చేరుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించాడు. మిడిలార్డర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో రాణించాడు.
బుమ్రా రెండు, షమీ, సిరాజ్ చెరో వికెట్ మాత్రమే తీశారు. దీంతో మన జట్టు పరాభవం మూటగట్టుకుంది. అభిమానులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. కానీ వారి ఆశలు నీటిమూటలే అయ్యాయి. మన ఆటగాళ్ల తీరుకు విచారం వ్యక్తం చేశారు. ఫైనల్ పరాభవం మనకు కొత్తేమీ కాదనే విషయం అందరికి తెలిసిందే. దీంతో మన లక్ ఇంతేలే అని సరిపెట్టుకున్నారు.