JAISW News Telugu

Railway Department : ఒకే ట్రాక్ పై నాలుగు రైళ్లు.. వీడియోపై రైల్వేశాఖ స్పష్టత

Railway Department

Railway Department

Railway Department : ఒకే రైల్వే ట్రాక్ పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయంపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. వరుస రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ఆందోళనకు కారణమైంది. దీంతో పలువురు రైల్వేలోని భద్రతా లోపాలకు నిదర్శనం ఈ వీడియో అంటూ షేర్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వీడియోపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పష్టతనిచ్చింది.

భువనేశ్వర్ లోని లింగ్ రాజ్ రోడ్డు ప్యాసింజర్ హాల్ట్ వద్ద ఒకే లైన్ లో నాలుగు రైళ్లు ఉన్న వీడియోను ఓ జాతీయ మీడియా తొలుత ట్వీట్ చేసిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే పేర్కొంది. ఈ క్రమంలో మిగిలిన మీడియా ఛానెళ్లూ దాన్ని అనుసరించాయని ఆక్షేపించింది. ఈ వీడియో ఆటో సెక్షన్ లోనిదని, ఆ సెక్షన్ లో ఒకే ట్రాక్ పై అనేక రైళ్లు నిలవొచ్చని పేర్కొంది. ఇదేమీ భద్రతాపరమైన లోపం కాదని స్పష్టం చేసింది. సెక్షన్ కెపాసిటీ, భద్రతను పెంచడం ఈ సాంకేతిక ఉద్దేశమని తెలిపింది. రోజూ వందలాది రైళ్లు ఈ ఆటో సిగ్నలింగ్ సెక్షన్ లోనే రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. ఈ తరహా వార్తలు రైల్వే ప్రతిష్ఠను దెబ్బతీస్తాయంది. మీడియాలో ప్రచురించే ముందు ధ్రువీకరించుకోవాలని హితవు చెప్పింది.

Exit mobile version