Hot web series : ప్రజెంట్ డేస్ ను ఓటీటీలే రాజ్యమేలుతున్నాయి. ఎప్పుడు ఏ ప్లాట్ ఫారంలో ఏ మూవీ, ఏ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందో ఇట్టే తెలిసిపోతోంది. వాటిలో ఇంట్రస్టింగ్ గా ఉండే దాని కోసం అన్వేషిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని మూవీస్, వెబ్ సిరీస్ ను వీక్షిస్తున్నారు.
తెలుగు సినీ అభిమానులు మలయాళం మూవీస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇటీవల రిలీజైన మళయాలం సినిమాలు భారీగా హిట్ అవుతున్నాయి. ఇటీవల రిలీజైన ‘మంజుమ్మల్ బాయ్స్, ‘ఆవేశం’, ‘గురువాయర్’, ‘ప్రేమలు’, ‘బ్రమయుగం’, ‘అబ్రహం ఓజ్లరు’, ‘అన్వేషిప్పియన్ కండేతుం’ వంటి సినిమాలు ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. వీటిల్లో కొన్ని ఓటీటీల్లో కూడా అదరగొట్టాయి.
మలయాళం సినిమాలకు భారీ బడ్జెట్ అవసరం లేదు. మంచి కథతో సినిమాను భారీ హిట్ చేస్తుంటారు దర్శకులు. అధిరిపోయే స్క్రీన్ ప్లేతో మరింత ఇంట్రస్టింగ్ తీసి ఓటీటీలో రిలీజ్ చేసి హిట్ చేస్తుంటారు. ఇక మలయాళం కు సంబంధించి థ్రిల్లర్స్, మిస్టరీ మూవీస్ వేరే లెవల్ లో ఉంటాయి. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ మూవీలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మరో కిర్రాక్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఆ వెబ్ సిరీస్ పేరే నాగేంద్రన్స్ హనీమూన్. ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనే ఉపశీర్షికతో వెబ్ సిరీస్ టీజర్ ఇటీవల విడుదలైంది. సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చూసేందుకు సింపుల్ గా ఉన్న దాని ఎఫెక్ట్ మన మీద పడేలా టీజన్ కట్ చేశారు. ట్రైలర్ కూడా అధిరిపోయింది. టీజర్, ట్రైలర్ చూస్తే.. ఊరిలో ఉండేందుకు ఏ మాత్రం ఇష్టపడని ఒక వ్యక్తి. విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. ఆ తర్వాత ఆయనకు ఐదుగురితో వివాహం జరుగుతుంది. డైరెక్టర్ కథను టీజర్ లో ఏ మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్ ఉండేలా చూశాడు. అందుకే టీజర్ ఇంట్రస్టింగ్ మారింది.
ఈ వెబ్ సిరీస్ డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. జూలై 19వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళం సినిమాలు చూసే వారికి ఈ సిరీస్ మంచి అనుభూతి ఇవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో కని కుశృతి, గ్రేస్ ఆంటోనీ, శ్వేత మీనన్, నిరంజన అనూప్, ఆల్ఫీ పంజికరణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ‘నాగేంద్రన్స్ హనీమూన్స్’ వెబ్ సిరీస్ దర్శకుడు రెంజీ ఫణిక్కర్. ఈయన గతంలో ‘కేరళ క్రైమ్ ఫైల్స్’, ‘మాస్టర్ పీస్’, ‘పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్’ వంటి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.