Sai Pallavi : సాయి పల్లవి నటనకు ఫిదా.. ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసిన ముద్దుగుమ్మ
ఫిదా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి పల్లవి ఆ తర్వాత తమిళ్ , తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటేనే ఈమె నటిస్తోంది. అలా తాను ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటుంది. సాయి పల్లవి తాజాగా నటించిన అమరన్ చిత్రం భారీ సక్సెస్ అందుకుంది.
ఇందులో సాయి పల్లవి పాత్ర ఆర్మీ లో పనిచేసే సోల్జర్ కు భార్యగా నటించాలి. అయితే ఆర్మీ అంటేనే కుటుంబానికి ఎక్కువగా దూరంగా ఉంటారు. ఇక్కడ పిల్లలని చూసుకోవడం కుటుంబ బాధ్యతలు ఒకవేళ ఆర్మీలో కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగినప్పుడు ఇక్కడ పడే వేదన, తపన ఇలా అన్ని సాయి పల్లవి తన నటనలో చూపించేసింది. దీంతో ఒక్కసారిగా సాయి పల్లవి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
సాయి పల్లవి ఇలా అద్భుతమైన నటనతో జీవించడం అనేది చాలా గొప్ప విషయమని అందరూ అంటున్నారు. చాలామంది నటీమణు లు వస్తుంటారు పోతుంటారు. కానీ సాయిపల్లవి లాంటివారు రావడం చాలా అరుదు అని చెబుతున్నారు.
కాగా సాయి పల్లవి ఈ సినిమా తర్వాత రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు ప్రచారం జరుగుతుంది. రూపాయలు 10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న హీరోల కంటే సాయి పల్లవి రెమ్యునేషన్ ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ విషయంలో సాయి పల్లవి ఎక్కడ తగ్గడం లేనట్టు ప్రచారం జరుగుతుంది దీనిపై స్పష్టత లేకున్నా సాయి పల్లవి ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా భారీ విజయం సాధిస్తుండడంతో ఆమెకు రెమ్యూనరేషన్ ఇవ్వడంలో ఎక్కడ కూడా నిర్మాతలు తగ్గడం లేదని సమాచారం.