Strange situation : సంక్రాంతి కానుకగా వచ్చిన భారీ సినిమాల్లో ఒక్కో సినిమాది ఒక్కో గాధ. ఏం ఖర్మనో గానీ ఈ సారి థియేటర్ల కేటాయింపు నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ల వరకు గందరగోళమే. ఒక పద్ధతిగా సాగుతున్న తరుణంలో ‘గుంటూరు కారం’ కాస్త డిస్ట్రబ్ చేసిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
గుంటూరు కారం భారీ కలెక్షన్లను రాబడుతుందని దిల్ రాజు ఎక్కువ థియేటర్లను కేటాయించాడు. హను-మాన్, సైంధవ్ తక్కువ థియేటర్లు ఇవ్వడంతో అదో గందరగోళం నెలకొంది. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అనౌన్స్ చేయడంతో హను-మాన్, సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ల డేట్లను మార్చుకున్నాయి. తీరా ఆ టైంకు పోలీసుల పర్మిషన్ దొరకకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. మరో రోజు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక తీరా రిలీజ్ కాగా.. గుంటూరు కారం నెగెటివ్ టాక్, హను-మాన్ బాక్సాఫీస్ టాక్, సైంధవ్ మిక్స్ డ్ టాక్ తో ఉన్నాయి.
ఇవన్నీ పక్కన ఉంచితే ఇప్పుడు ‘సైంధవ్’ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ డైరెక్టర్ సైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చింది. విశ్వక్ సేన్ ‘హిట్’తో ఆయన ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత అడవి శేషుతో ‘హిట్2’ చేశాడు. ఇది కూడా మంచి హిట్ సాధించింది.
ఇక ఇప్పుడు విక్టరీతో ‘సైంధవ్’ చేశాడు. మిక్స్ డ్ టాక్ దక్కించుకున్నా.. గుంటూరు కారం, హను-మాన్ రెండింటి గురించే టాక్ వినిపిస్తుంది కానీ సైంధవ్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది, ఇలా ఉండగా.. వెంకటేష్ ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది.