JAISW News Telugu

East Godavari: టీ పౌడర్ అనుకొని పురుగుమందు టీ తాగి వృద్ధ దంపతుల మృతి

East Godavari: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టీ పొడి అనుకొని పొరపాటున పురుగుల మందు వేసుకుని టీ తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. టీ తాగిన వెలుచూరి గోవింద్ (75), అప్పాయమ్మ (70) అనే వృద్ధ దంపతులు మృతి చెందారు. కోతి పురుగుల మందు ప్యాకెట్ తీసుకుని వచ్చి వృద్ధ దంపతుల ఇంటి ముందు పడేసింది. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పురుగుల మందు ప్యాకెట్ ను టీ పొడి ప్యాకెట్ గా భావించి టీ పెట్టుకొని దంపతులు తాగారు. కొద్దిసేపటికి నోటి నుంచి నురగలు రావడం గమనించి స్థానికులు వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధ దంపతులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version