Airports : ప్రపంచ వ్యాప్తంగా చాలా విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయం అనేది ఆ దేశానికి ప్రవేశ ద్వారం. ప్రతీ దేశంలోని ప్రధాన నగరాల్లో ఎయిర్ పోర్టులు ఉంటాయి. ప్రపంచంలోని వెయ్యికి పైగా విమానాశ్రయాలను కలిగి ఉన్న 5 ప్రధానమైన దేశాల గురించి తెలుసుకుందాం.
ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉంది. యూఎస్ లో 14,712 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది వరల్డ్ లోనే అత్యధిక విమానాశ్రయాలు కలిగిన దేశం. దీని ద్వారా ప్రతీ సంవత్సరం మిలియన్ల మంది యునైటెడ్ స్టేట్స్ కు ప్రయాణిస్తుంటారు. వీటిలో 102 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి.
1,000 కంటే ఎక్కువ ఉన్న దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. అక్కడ మొత్తం 4,093 ఉన్నాయి. 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో బ్రెసిలియా అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉండేది.
1,714 విమానాశ్రయాలతో మెక్సికో మూడో స్థానంలో ఉంది. వాటిలో 36 మాత్రమే అంతర్జాతీయ ప్రయాణంను అందిస్తాయి. 2015లో ప్రారంభించిన బెనిటో జుయారెజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇది అత్యంత రద్దీగా ఉండేది.
కెనడాలో 1467 విమానాశ్రయాలున్నాయి. జాబితాలో కెనడా 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కెనాకు ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడి టొరంటో విమానాశ్రయంలో చాలా విమానాలు వస్తుంటాయి.
రష్యాలో 1218 విమానాశ్రయాలున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న వాటిలో రష్యా 5వ స్థానంలో ఉంది. మాస్కోలో మాత్రమే మధ్యస్థ, రెండు పెద్ద ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ప్రతీ ఏటా 80 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి సేవలను వినియోగించుకుంటున్నారు.
భారత్ లో కేవలం 486 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. 1000 విమానాశ్రయాల్లో సగం కూడా లేవు. 34 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు, 10 కస్టమ్స్ 103 దేశీయ విమానాశ్రయాలతో సహా 137 విమానాశ్రయాలున్నాయి.