JAISW News Telugu

Kanguva : ‘కంగువ’ను ప్రేక్షకులు ఇలా అర్థం చేసుకున్నారా..? అందుకే చూడడం లేదా..?

Kanguva

Kanguva

Kanguva : ఇప్పుడు టాపిక్ అంతా ‘కంగువ’ గురించే నడుస్తోంది. బాహుబలి 2 కంటే భారీ హిట్ అవుతుందని, ఈజీగా రూ. 2000 కోట్లను టచ్ చేస్తుందని తమిళ ఇండస్ట్రీ నుంచి భారీ చిత్రం కాబోతుందని నిర్మాతతో పాటు మేకర్స్ కలలు కన్నారు. కానీ సినిమా మాత్రం అన్ని సెంటర్లలో నెగెటివ్ కామెంట్లను మోసుకచ్చింది.

తెలుగు ఇండస్ట్రీ నుంచి (సలార్, కల్కి 2898, దేవర) ఏదైనా భారీ స్థాయిలో సినిమా వచ్చిందంటే చాలు అంచనాలు పెరుగుతూనే ఉంటాయి. ఈవెంట్ సినిమాలు లేదంటే భారీ స్థాయి సినిమాలు వ్యూవర్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. సగటు కంటెంట్ తో కూడా.. తెలుగు పాన్ ఇండియా చిత్రాలు డబ్బును తిప్పుతూ మాయాజాలం చేస్తాయి.

అయితే, ‘కంగూవ’ విషయానికి వస్తే సూర్య లాంటి స్టార్ డిఫరెంట్ గెటప్ లో కనిపించినా.. ఎలాంటి ట్రోల్స్ కు గురికాకున్నా.. విలక్షణమైన సెటప్ తో మొదటి నుంచీ ప్రేక్షకులను మెప్పించడంలో ఈ మూవీ విఫలమైంది. టాలీవుడ్ టైర్1 స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ కు ఇది పూర్తిగా భిన్నం.

యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ముందుగానే బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ, నార్త్ అమెరికన్ ప్రీసేల్స్ $100K ను తాకడంతో, ఫస్ట్ షో కు ముందే కంగువా విఫలమైంది. భారత్ లో ఓపెనింగ్ కూడా పేలవంగా మారింది. ఇప్పుడు రిజల్ట్ బయటకు వచ్చింది. శంకర్ ఇండియన్ 2 మాదిరిగా కంటెంట్ బాగోలేకపోయినా ఈ సినిమాకు ఇండియన్ 2 కు సమానమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే..? ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సూర్య, తదితర భారీ తారాగణంతో మేకింగ్ చేసినా ప్రేక్షకులు ఎందుకు ఇంట్రస్ట్ చూపలేదు.

స్థానిక తమిళ మార్కెట్లలో కూడా గౌరవప్రదమైన ఓపెనింగ్ ఇచ్చేందుకు పట్టించుకోని ఈ సినిమాలో లోపం ఉందని వారు ఎలా గ్రహించారు. సినిమా పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడానికి డీఎస్పీ మ్యూజిక్ ఒక కారణం కావచ్చు. అయితే టీజర్, రెండు ట్రైలర్స్ లో విజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయినా ప్రేక్షకులు సినిమాను తేలిగ్గా తీసుకొని మొదటి షో నుంచే థియేటర్లకు రావడం లేదు.

అన్ని హైప్ లు ఉన్నప్పటికీ భారీ స్థాయిలో, స్పాన్ లో తెరకెక్కిన ఇతర పాన్ ఇండియా పీరియాడిక్ సినిమాల మాదిరిగా ఫస్ట్ డే ఫస్ట్ షోకు థియేటర్లకు రాలేదు. బహుశా అందుకేనేమో జనతా జనార్ధన్ హై అంటున్నారేమో!.

Exit mobile version