JAISW News Telugu

CM Revanth : ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్

FacebookXLinkedinWhatsapp
CM Revanth

CM Revanth

CM Revanth : సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదమంత్రోచ్ఛరణల నడుమ దీవించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేషవస్త్రం అందించారు.

అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Exit mobile version