YouTube star : యూట్యూబ్ స్టార్ పై కేసుల మీద కేసులు.. జైలుకు వెళ్లడం ఖాయమా ?

YouTube star

YouTube star Harsha Sai

YouTube star Harsha Sai : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది చిన్న హీరోయిన్లు తమను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ కొంతమంది స్టార్స్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. ఈ మధ్య జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్  మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడని కేసు పెట్టింది. ఈ కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

జానీ మాస్టర్ వివాదం ముగిసిపోకముందే యూట్యూబ్ స్టార్ ప్రజా సేవకుడు అని పేరు తెచ్చుకుంటున్న హర్ష సాయిపై బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న ఒక యువ నటి కేసు పెట్టింది. తనను వాడుకొని వదిలి పెట్టాడని పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడని కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే హర్ష సాయి యూట్యూబ్ ర్ గా చాలామందికి సుపరిచితుడు.

ప్రజాసేవ చేస్తూ చాలామందికి సహాయం చేస్తూ వీడియోలు తీసుకు ఈయన ఫేమస్ అయ్యాడు. అయితే  హర్ష సాయి నా దగ్గర రెండు కోట్లు తీసుకున్నాడు అని ఆ హీరోయిన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. అంతే కాకుండా తనను లైంగికంగా వేధించాడని కంప్లైంట్ లో పేర్కొంది. దీంతో హర్ష సాయి అభిమానులు ఒక్కసారి షాక్ కు గురయ్యారు. కాగా హర్ష సాయి కూడా ఈ విషయంపై ఆడియో విడుదల చేశాడు. పలానా హీరోయిన్ తనతో డేటింగ్ చేయమని ఒత్తిడి చేసినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో హర్ష సాయి అభిమానులు ఫ్రెండ్స్ ఆ హీరోయిన్ ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.

దీంతో మళ్లీ తిరిగి ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. హర్ష సాయి అనుచరులు తనను వేధిస్తున్నారని తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని స్క్రీన్ షాట్స్ తో సహా వెళ్లి మళ్లీ పోలీసులు కంప్లీట్ ఇచ్చింది. ఆ తర్వాత మరొక హీరోయిన్ వచ్చి తనను కూడా వేధించాడని  కేసు పెట్టింది. సాయి తన స్వీయ దర్శకత్వం లో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా పట్టాలకెక్కి ప్రజల ముందుకు వస్తుందా లేక హర్ష సాయి పై కేసులు నమోదయి ఆయన జైలుకు వెళ్తాడా అనే సందేహం నెలకొంది.

TAGS