IndiGo Flight : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

IndiGo Flight

IndiGo Flight

IndiGo Flight : చెన్నై నుంచి ముంబై బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. దీంతో వెంటనే ఆ విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి.

అధికారులు తెలిపిన ప్రకారం శనివారం ఉదయం 6.50 గంటలకు 172 మంది ప్రయాణికులు, సిబ్బందితో చెన్నై నుంచి ఇండిగో విమానం ముంబైకి బయల్దేరింది. కొద్ది సేపటికి విమానంలో బాంబు ఉందనే బెదిరింపు కాల్స్ వచ్చాయి. విమానంలో ఓ రిమోట్ సైతవ లభ్యమైంది.

వెంటనే స్పందించిన పైలట్లు ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే సమయానికి ముంబై విమానాశ్రయ అధికారులు ఫైర్ టెండర్లు, అంబులెన్స్ లనే సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులను క్షేమంగా దించేశారు. అనంతరం రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది, విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానాన్ని టెర్మినల్ ప్రాంతంలో ఉంచినట్లుగా అధికారులు తెలిపారు.

TAGS