Rajinikanth : సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అంత ఈజీ కాదు. కొంతమందికి ఈజీగా విజయాలు వస్తాయి. మరికొంత మందికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కొంతమంది ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటారు . కాగా కొంతమంది విజయాలు సాధించి అగ్రశ్రేణి నటులు గా చరిత్రలో నిలిచిపోతారు. మరికొంత మంది చేయాల్సిన సినిమాలు విడిచిపెట్టి అవి ఆ తర్వాత హిట్ అయ్యాయని బాధపడుతూ కూర్చుంటారు.
తర్వాత అవి విజయాలు సాధించి తద్వారా ఫేమస్ కావాలంటే కొంతమందికి జీవితకాలం సరిపోతుంది. మరికొందరికి అవకాశాలు రాక ఇబ్బంది పడుతూ కాలం వెలదీస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోలు తాము చేయాల్సిన సినిమాలనే మరో హీరో చేసి వాటి ద్వారా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించినవి తెలుగులో ఎన్నో ఉన్నాయి.
అలా ప్రతి రంగంలో కూడా తాము చేయాల్సిన పనులు కాకుండా ఇతర వాళ్ళు చేసుకుని వాటి ద్వారా స్టార్లుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు.తమిళ ఇండస్ట్రీలో హీరో కమల్ హాసన్ రజనీకాంత్ రెండు కళ్ళ లాంటివారు. ఇద్దరికీ అతిపెద్ద ఫ్యాన్స్ బేస్ ఉంది. కమల్ హాసన్ చేయాల్సిన కొన్ని సినిమాలను రజనీకాంత్ కొట్టేశాడు. ఆ సినిమాల ద్వారానే రజనీకాంత్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. భారీ బంపర్ హిట్లు కొట్టాడు. చేయాల్సిన కొన్ని సినిమాలను చేసి సూపర్ స్టార్ గా ఎదిగిపోయారు.
కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ముత్తు సినిమాలో రజనీకాంత్ నటించారు. ఈ సినిమాని మొదటగా కమలహాసన్ తో అనుకున్నా అప్పటికి డేట్స్ విషయంలో అడ్జస్ట్ కాకపోవడంతో రజనీకాంత్ చేశారు. ముత్తు సినిమా దాదాపు 200 రోజులు పైనే ఆడింది. ఆ తర్వాత సురేష్ కృష్ణ దర్శకత్వంలో బాషా సినిమాను నిర్మించారు. ఇది మాఫియా నేపథ్యంలో ఉండడంతో చివర్లో క్లైమాక్స్ అండ్ ఇతర కొన్ని విషయాలు నచ్చకపోవడంతో కమల్ హాసన్ దీన్ని రిజెక్ట్ చేశాడంట. దీన్ని కూడా రజనీకాంత్ చేసి సూపర్ డూపర్ హిట్ సాధించారు.
ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ కమలహాసన్ తో చేయాల్సినటువంటి రోబో సినిమాని రజినీకాంత్ చేశారు. ఈ మూడు సినిమాలు బంపర్ హిట్ కావడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ టాప్ హీరో గా నిలిచాడు. ఇలా తాను అనుకున్న సినిమాలు రజినీకాంత్ కి వెళ్ళిపోయాయి. ఆ మూడు సినిమాలు కూడా దాదాపు బ్లాక్ బస్టర్ కావడంతో కమలహాసన్ బాధపడ్డట్టు సమాచారం.