దీనికి కారణం ఏమిటంటే వీరు పండించే వెల్లుల్లిని ఎక్కువగా పురుగు మందులు వాడి పండిస్తూ ఉంటారు. భారతదేశంలో పండే వెల్లుల్లిని సహజంగా పండిస్తారు. ఎక్కువగా పురుగు మందులను వాడరు. కానీ చైనీస్ వెల్లుల్లి తొందరగా మార్కెట్లోకి తీసుకురావడానికి ఎక్కువగా పురుగుమందు అవశేషాలను వినియోగిస్తూ ఉంటారు.
అయితే వీటిని ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియడం లేదు. వీటిని ఈజీగా గుర్తించవచ్చు. చైనా వెల్లుల్లి కాస్త పింక్ కలర్ లో ఉండి చిన్నగా ఉంటుంది. లేదా పూర్తిగా తెల్ల కలర్ లో ఉండి కాస్త పెద్దగా ఉంటాయి. చైనా వెల్లుల్లి పొట్టు తీసే సమయంలో ఈజీగా బయటకు వస్తుంది. అదే స్వదేశ వెల్లుల్లి పొట్టు తీయడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే చైనా వెల్లుల్లి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని చాలామంది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇండియాలో పండిన వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలని చెబుతున్నారు.
వీలైనంత మేరకు చైనా వెల్లుల్లిని దూరం పెట్టాలని సూచిస్తున్నారు. చైనా వెల్లుల్లి ఇండియా ఎప్పుడో బ్యాన్ చేసింది. కానీ ఇది మా ర్కెట్లోకి విచ్చలవిడిగా వస్తుంది. అయితే నిజ జీవితంలో వెల్లుల్లి తినడం వల్ల మనిషి శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. హెల్త్ పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ నకిలీ వెల్లుల్లి కూడా తయారు చేయడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.దీనిపై చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.