AP assembly : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

AP assembly

AP assembly

AP assembly : ఏపీలో రేపటి (సోమవారం) నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సర్వ సన్నద్ధమైంది. అయిదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరుతో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు ప్రజల ముందు ఉంచారు. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలపై సభలోనే చర్చ పెట్టనున్నారు. సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్లు కండువాలతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని టీడీఎల్పీ సూచించింది.

TAGS